కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. నిందితుల మధ్య లోతైన బంధం.. ఏకంగా 238 గంటల ఫోన్ కాల్స్
Actor ProfilePolitician

కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. నిందితుల మధ్య లోతైన బంధం.. ఏకంగా 238 గంటల ఫోన్ కాల్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. నిందితుల మధ్య లోతైన బంధం.. ఏకంగా 238 గంటల ఫోన్ కాల్స్
AP7AM30 Jul 2026
కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. నిందితుల మధ్య లోతైన బంధం.. ఏకంగా 238 గంటల ఫోన్ కాల్స్

రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సియా గోయల్, చేతన్ చౌదరి మధ్య కేవలం సాధారణ పరిచయమే కాకుండా చాలా లోతైన వ్యక్తిగత సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య గత కొన్ని నెలల్లో వేలసార్లు ఫోన్ కాల్స్ జరగడం, హత్యకు ముందు రోజు ప్రత్యేకంగా సమావేశం కావడం వంటి అంశాలు ఇప్పుడు దర్యాప్తును కొత్త కోణంలోకి తీసుకెళుతున్నాయి.క్రికెట్ ద్వారా పరిచయం.. దీపావళి పార్టీతో బలపడిన బంధంపోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు చేతన్ చౌదరి, సియా గోయల్ అన్న సాహిల్ గోయల్‌కు క్రికెట్ ద్వారా మిత్రుడు. సాహిల్‌తో కలిసి చేతన్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడేవాడు. ఆ సమయంలో సియా తరచుగా తన సోదరుడితో పాటు మ్యాచ్‌లకు వెళ్లేది. అప్పుడే వారిద్దరి మధ్య తొలి పరిచయం ఏర్పడిందని పోలీసులు భావిస్తున్నారు. ఆ తర్వాత 2025 దీపావళి సందర్భంగా ఓ కామన్ ఫ్రెండ్ ఇచ్చిన పార్టీలో వీరిద్దరూ మళ్లీ కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య సంభాషణలు, రాకపోకలు బాగా పెరిగాయి.విచారణలో భాగంగా పరిశీలించిన కాల్ డేటా రికార్డులు (సీడీఆర్‌) విస్తుపోయే నిజాలను బయటపెట్టాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు సియా, చేతన్ మధ్య ఏకంగా 2,004 ఫోన్ కాల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కాల్స్ మొత్తం వ్యవధి దాదాపు 238 గంటలు ఉండటం వారి మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని సూచిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న‌ సియా సోదరుడు సాహిల్ గోయల్‌ను