కొత్త మలుపు’.. గాయని సునీత తనయుడి మూవీ ఎలా ఉంది
Actor ProfileActor

కొత్త మలుపు’.. గాయని సునీత తనయుడి మూవీ ఎలా ఉంది

Total News1
Movie Updates0
Sources1
కొత్త మలుపు’.. గాయని సునీత తనయుడి మూవీ ఎలా ఉంది
Eenadu13 Jun 2026
కొత్త మలుపు’.. గాయని సునీత తనయుడి మూవీ ఎలా ఉంది

Kotha malupu Review || చిత్రం: కొత్త మలుపు; నటీనటులు: ఆకాశ్, భైరవి ఆర్థ్యా, రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి, మహేందర్, ఐశ్వర్య, సిద్ధు తదితరులు; సంగీతం: యశ్వంత్‌ నాగ్‌; ఛాయాగ్రహణం: సుమంత్‌ కచర్ల, జవహర్‌ రెడ్డి; నిర్మాత: తాటి బాలకృష్ణ; దర్శకత్వం: శివ కేసనకుర్తి; విడుదల తేదీ: 12-06-2026 ‘సర్కారు నౌకరి’ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు గాయని సునీత కుమారుడు ఆకాశ్‌. ఇప్పుడాయన నుంచి వచ్చిన రెండో సినిమా ‘కొత్త మలుపు’. మరి ఈ చిత్ర కథేంటి? హీరోగా ఆకాశ్‌ కెరీర్‌ని మలుపు తిప్పిందా? Kotha malupu story || ఏ బాధ్యతలు లేకుండా స్నేహితులతో కలిసి సరదాగా జీవితాన్ని గడిపేసే హైదరాబాదీ కుర్రాడు కమల్‌ (ఆకాశ్‌). ఓసారి తన కుటుంబ వివాహ వేడుక కోసం కోనసీమ జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరికి వెళ్లగా.. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా) అనే అమ్మాయి తారసపడుతుంది. దీంతో తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకుంటాడు కమల్‌. ఓరాత్రి వేళ అవమానకర పరిస్థితుల్లో చిక్కుకున్న కమల్‌ను గుర్తు తెలియని యువతి కాపాడుతుంది. ఆమెను వెతికి పట్టుకునేందుకు వరలక్ష్మితో కలిసి అన్వేషణ ప్రారంభిస్తాడు కమల్‌. మరి అలా మొదలైన వాళ్లిద్దరి ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది? ఈక్రమంలో కమల్‌కి కనిపించిన ఓ ఫొటో వల్ల వాళ్ల మధ్య ఎలాంటి అనుమానాలు, అపార్థాలు తలెత్తాయి? తాను వెతుకున్న అమ్మాయికి.. తను మనసు పారేసుకున్న వరలక్ష్మికీ ఏమైనా సంబంధం ఉందా? లేదా? ఆఖరికి ఈ ప్రేమకథ గెలిచిందా? లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. Kotha malupu Review || ఇద్దరి మధ్య ప్రేమలో ఓ అనుమానం మొదలైతే.. అదెంతటి ప్రమాదకర పరిస్థితులకు కారణమవుతుందో తెలియజెప్పే చిత్రమిది. ఈ ప్రేమకథకు కోనసీమ అందాలు జోడించి ప్రేక్షకులకు ఓ ఆహ్లాదకరమైన అనుభూతిని అందించే ప్రయత్నం చేశారు దర్శకుడు. అయితే ఆ పల్లెటూరి విజువల్స్‌ కనులకు ఇంపుగా అనిపించినా.. ప్రథమార్ధంలో కథలో