కొత్త బీఎండబ్ల్యూ కారు
Actor ProfileActor

కొత్త బీఎండబ్ల్యూ కారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొత్త బీఎండబ్ల్యూ కారు
Sakshi10 Aug 2026
కొత్త బీఎండబ్ల్యూ కారు

బీఎండబ్ల్యూ కంపెనీ ఇండియన్ మార్కెట్లో 'ఎక్స్6 ఎమ్60ఐ ఎక్స్‌డ్రైవ్'ను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.78 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది భారతదేశానికి సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా దిగుమతి అవుతుంది. బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎమ్60ఐ ఎక్స్‌డ్రైవ్ కారు 4.4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ8 పెట్రోల్ ఇంజన్, 48V మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ పొందుతుంది. ఇది 530 bhp పవర్, 750 Nm టార్క్ అందిస్తుంది. ఇది 4.3 సెకన్లలో 0-100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 250కిమీ/గం. ఇంజిన్ 8 స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ పొందుతుంది. కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎమ్60ఐ ఎక్స్‌డ్రైవ్ కొంత అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. ఈ కారు ముందు భాగంలో ఎం షాడోలైన్ డీటైలింగ్‌తో కూడిన సన్నని అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, వర్టికల్ డబుల్ స్లాట్‌లు వంటివి మాత్రమే కాకుండా.. ప్రకాశవంతమైన M లోగోతో కూడిన బ్లాక్ కిడ్నీ గ్రిల్, గ్లాస్ బ్లాక్ ఎమ్ ఎక్స్‌టీరియర్ మిర్రర్స్, ఎమ్ స్పెషల్ సైడ్ స్కర్ట్‌లను కలిగి ఉంది. వెనుక వైపు.. సన్నని ఎల్ ఆకారపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి. ఈ SUV రన్ ఫ్లాట్ టైర్లతో కూడిన 21 అంగుళాల ఎమ్ లైట్-అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. లోపలి భాగంలో.. ఒకే గ్లాస్ ప్యానెల్ కింద 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఉంటాయి. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సరికొత్త బీఎండబ్ల్యూ ఆపరేటింగ్ సిస్టమ్ 8.5తో పనిచేస్తుంది, ఇది బీఎండబ్ల్యూ ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్టెంట్ ద్వారా టచ్, వాయిస్ నియంత్రణలకు మద్దతు ఇస్తుంది. సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబీఎస్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్