కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో రూ. 60
Actor ProfilePolitician

కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో రూ. 60

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో రూ. 60,000 వేల వరకు
Zee Telugu23 Jun 2026
కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో రూ. 60,000 వేల వరకు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Kerala government EV incentive 2026: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ కార్లను ప్రోత్సహించడంపై ద్రుష్టి సారిస్తోంది. కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విభాగాన్ని ప్రోత్సహించేందుకు క్రుషి చేస్తున్నాయి. జూన్ 18, 2026న కేరళ ప్రభుత్వం తన బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సమయంలో ఈవీలపై భారీ ప్రకటన చేసింది. తన బడ్జెట్ లో కేరళ ఎలక్ట్రిక్ వాహనాల కోసం తన మార్గాలను పునర్వ్యవస్థీకరించింది. పలు సెగ్మెంట్స్ ఎలక్ట్రిక్ కార్లపై ట్యాక్సులను వేర్వేరుగా నిర్ణయించింది. దీంతో ప్రజలకు భారీగా ప్రయోజనం చేకూరనుంది. ఈ పన్ను మార్పులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రజలు ఈవీ కొనుగోళ్లపై రూ. 74,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇదేలా సాధ్యం అవుతోంది తెలుసుకుందాం. 3 శాతం పన్ను తగ్గింపు: కేరళ ప్రభుత్వం తన బడ్జెట్లో ఈవీలపై పన్నును సవరించింది. దీని ప్రకారం రూ. 15లక్షల నుంచి 20లక్షల మధ్య ఉన్న ఈవీలపై రోడ్డు ట్యాక్స్ 8 శాతం నుంచి 5శాతానికి తగ్గించారు. ఈ 3శాతం తగ్గింపు వల్ల 20లక్షల కారుపై రూ. 60,000 వరకు ఆదా అవుతుంది. 20లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై 74000 వరకు ఆదా చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ సమయంలో ఒకేసారి పన్ను ఆదా అవుతుంది. 10లక్షల వరకు ధర ఉన్న ఈవీలపై రోడ్డు ట్యాక్సును 5శాతం నుంచి 3శాతానికి తగ్గించడంతో 2శాతం పన్ను తగ్గింది. దీంతో 20,000 వేల వరకు ఆదా అవుతుంది. రూ. 10లక్షల నుంచి 15లక్షల మధ్య ఉన్న కార్లకు ఆర్టీవో నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. వీటిపై 5శాతం పన్ను యథావిధిగా కొనసాగుతుందని తెలిపింది. భారత మార్కెట్లో