కొత్త అమ్మాయి విశాఖ ధీమన్ ... బ్యాక్ టు బ్యాక్ మూవీస్
Actor ProfileActor

కొత్త అమ్మాయి విశాఖ ధీమన్ ... బ్యాక్ టు బ్యాక్ మూవీస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొత్త అమ్మాయి విశాఖ ధీమన్ ... బ్యాక్ టు బ్యాక్ మూవీస్
Chitrajyothy1 Jul 2026
కొత్త అమ్మాయి విశాఖ ధీమన్ ... బ్యాక్ టు బ్యాక్ మూవీస్

కొత్త కథానాయిక విశాఖ ధీమన్‌ నటించిన రెండు సినిమాలు వచ్చే నెలలో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కాబోతున్నాయి. ఆమె నటించిన 'రాజా ది రాజా' జూలై 17న వస్తుండగా, జూలై 31న 'రోమియో జూలియెట్' మూవీ రిలీజ్ కానుంది. కొత్త హీరోయిన్లు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రావడం అంటే విశేషమే. విశాఖ ధీమన్ (Vishakha Dhiman) నటించిన రెండు సినిమాలు అలా ఒకే నెలలో రెండు వారాల గ్యాప్ తో రాబోతున్నాయి. ఆమె నటించిన 'రాజా ది రాజా' మూవీ జూలై 17న విడుదల కాబోతుండగా, 'దీవానా' ఫేమ్ హర్షిత్‌ రెడ్డి (Harshith Reddy) సరసన నటించిన 'రోమియో జూలియెట్' (Romeo Juliet) మూవీ జూలై 31న విడుదల కాబోతోంది. ఇక మొదటి చిత్రానికి వస్తే... రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ 'రాజా ది రాజా' (Raja The Raja). వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారికా దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు. ఈ సినిమాను అనిల్‌ బోయిడపు డైరెక్ట్ చేశారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాను జూలై 17న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకు రావడం విశేషం. దీంతో సినిమా మరింత గ్రాండ్‌గా ప్రేక్షకులను చేరుకునే అవకాశం లభించినట్లయిందని మేకర్స్ తెలిపారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో హీరో, హీరోయిన్‌ మధ్య కెమిస్ట్రీతో పాటు వారి సరదా ప్రయాణాన్ని హైలైట్ చేశారు. కలర్ ఫుల్ విజువల్స్, ఆకట్టుకునే డిజైన్ చిత్రంలోని రొమాంటిక్ మూడ్‌ను ప్రజెంట్ చేస్తోంది. రుత్విక్, విశాఖ ధీమన్ ఉత్సాహంగా, ఎనర్జీతో కనిపిస్తున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అనిపించేలా పోస్టర్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్‌ విడుదలైంది. ఈ చిత్రానికి మార్క్ కె