కొత్త అధ్యాయానికి ఆల్ ది బెస్ట్
Actor ProfileActor

కొత్త అధ్యాయానికి ఆల్ ది బెస్ట్

Total News1
Movie Updates0
Sources1
కొత్త అధ్యాయానికి ఆల్ ది బెస్ట్
Chitrajyothy14 Jun 2026
కొత్త అధ్యాయానికి ఆల్ ది బెస్ట్

నటి లయ సెకండ్‌ ఇన్నింగ్స్‌తో బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత భర్త డాక్టర్‌ గణేశ్‌తో కాలిఫోర్నియాలో స్థిరపడిన ఆమె ప్రస్తుతం సినిమాల కోసం హైదరాబాద్‌లో ఉంటున్నారు. నటి లయ (laya) సెకండ్‌ ఇన్నింగ్స్‌తో బిజీగా ఉన్నారు. పెళ్లి తర్వాత భర్త డాక్టర్‌ గణేశ్‌తో కాలిఫోర్నియాలో స్థిరపడిన ఆమె ప్రస్తుతం సినిమాల కోసం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆమెకు ఇద్దరు సంతానం. కూతురు శ్లోక (Daughter sloka) ప్రస్తుతం హైస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. దానికి సంబంధించిన కాన్వొకేషన్‌ ఘనంగా జరిగింది. ఈ ఆనందాన్ని లయ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే కన్నా.. నీ జీవితంలో తదుపరి ప్రయాణం మరింత జ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, విజయాలు, అపారమైన అవకాశాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాం. న్యూయార్క్‌ యూనివర్సిటీలో అడుగుపెడుతున్న నీకు అభినందనలు. నీ కొత్త అధ్యాయానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నీ సాధన పట్ల మాకు ఎంతో గర్వంగా ఉంది’ అని లయ పేర్కొన్నారు. 2010లో సినిమాలకు స్వస్తి చెప్పిన ఆమె 2018లో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోని’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. తదుపరి ‘తమ్ముడు’, ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే వెబ్‌ సిరీస్‌, ఓటీటీ చిత్రాలతో కూడా బిజీ అయ్యారు