కూటమి పాలనలో సిక్కోలు ప్రగతి ప్రస్థానం
Actor ProfilePolitician

కూటమి పాలనలో సిక్కోలు ప్రగతి ప్రస్థానం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కూటమి పాలనలో సిక్కోలు ప్రగతి ప్రస్థానం
Vaartha19 Jun 2026
కూటమి పాలనలో సిక్కోలు ప్రగతి ప్రస్థానం

NDA Government | శ్రీకాకుళం, జూన్ 19: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేశామని, మిగిలిన సంక్షేమ కార్యక్రమాలను కూడా దశలవారీగా పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నామని తెలిపారు. Read Also: Rental rules: అద్దెదారులకు శుభవార్త.. కేంద్రం కొత్త నిబంధనలు జిల్లాకు ప్రతిష్టాత్మకమైన మూలపేట అంతర్జాతీయ పోర్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, పలాస ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. నేరడి బ్యారేజ్ అంతర్రాష్ట్ర వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి గెజెట్ నోటిఫికేషన్ సాధించామని వెల్లడించారు. వంశధార, నాగవళి, బహుదా, మహేంద్రతనయ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన పెట్టుబడి అనుకూల వాతావరణంతో దేశంలోకి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయని, వాటి ద్వారా యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ₹3,300 కోట్ల వ్యయంతో 54 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులకు ఆమోదం లభించిందని తెలిపారు. సభలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతి నివేదికను సమర్పించారు. మూలపేట పోర్టు మౌలిక వసతుల పనులు ఇప్పటికే 75 శాతం పూర్తయ్యాయని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పాతపట్నం ఎమ్మెల్యే మామిడి