కౌంటీలోనూ అదే జోరు.. బౌలింగ్ తో హడలెత్తించిన మానవ్ సుతార్
Actor ProfilePolitician

కౌంటీలోనూ అదే జోరు.. బౌలింగ్ తో హడలెత్తించిన మానవ్ సుతార్

Total News1
Movie Updates0
Sources1
కౌంటీలోనూ అదే జోరు.. బౌలింగ్ తో హడలెత్తించిన మానవ్ సుతార్
Sakshi13 Jun 2026
కౌంటీలోనూ అదే జోరు.. బౌలింగ్ తో హడలెత్తించిన మానవ్ సుతార్

టీమిండియా తరఫున అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టిన మానవ్ సుతార్ కౌంటీ చాంపియన్‌షిప్‌లోనూ తన బౌలింగ్‌తో బెంబెలె త్తిస్తు‍న్నాడు. ఆఫ్గన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏడు వికెట్లు తీసిన మానవ్ సుతార్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’గా నిలిచి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. ఆఫ్గన్‌పై ప్రదర్శనతో కౌంటీ క్రికెట్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న మానవ్ సుతార్ అక్కడ కూడా అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించాడు. వార్విక్‌షైర్ తరఫున బరిలోకి దిగిన మానవ్ సుతార్ యార్క్‌షైర్‌తో జరుగుతున్న కౌంటీ మ్యాచ్‌లో 85 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మానవ్ సుతార్ తీసిన మూడు వికెట్లు కీలకమైనవే కావడం విశేషం. మొదట హాఫ్ సెంచరీ చేసిన సామ్ వైట్‌మన్ (55)ను పెవిలియన్ చేర్చిన మానవ్ సుతార్.. తన సెంచరీతో యార్క్‌షైర్ ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచిన విలియమ్ లక్స్‌టన్ (167 పరుగులు) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత చివర్లో యార్క్‌షైర్ భారీ స్కోరు చేయడంలో సహాయపడిన జార్జ్ హిల్ (30)ను ఔట్ చేసి ముచ్చటగా మూడో వికెట్ తీసుకున్నాడు. ఇలా అరంగేట్రం మ్యాచ్‌లోనే మూడు కీలక వికెట్లు తీసి కౌంటీ క్రికెట్‌లోనూ మానవ్ సుతార్ అదుర్స్ అనిపించాడు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ 110.4 ఓవర్లలో 469 పరుగులకు ఆలౌటైంది. విలియం లక్స్‌టన్ సెంచరీతో ఆకట్టుకోగా, కెప్టెన్ జానీ బెయిర్ స్టో (68)తో పాటు సామ్ వైట్‌మన్ అర్థసెంచరీ సాధించారు. మానవ్ సుతార్‌, ఈతన్ బాంబర్‌, ఎడ్ బెర్నాడ్‌లు తలా మూడు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ ఆరంభించిన వార్విక్‌షైర్ 23 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. రాబర్ట్ యేట్స్ (22), సామ్ హెయిన్ (1) పరుగుతో క్రీజులో ఉన్నారు. పచ్చని కొండల్లో శ్రీలీల జాలీ ట్రిప్ (ఫొటోలు) ‘రావు బహదూర్’ సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు) 'ఓ..!సుకుమారి'