
వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్ 8GB + 256GB వేరియంట్ ధర రూ. 41,999 భారీ 9020mAh బ్యాటరీతో వివో టీ5 ప్రో 5జీ ఫోన్లు అందుబాటులో 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సెటప్ Top Smartphones 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారీ బ్యాటరీ ఉన్న ఫోన్ కావాలా? ప్రస్తుతం మార్కెట్లో పెద్ద బ్యాటరీ ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. భారీ బ్యాటరీ ఫోన్లు తీసుకుంటే లాంగ్ టైమ్ ఛార్జింగ్ అందిస్తాయి. అందుకే చాలామంది వినియోగదారులు పెద్ద బ్యాటరీ ఫోన్లే ఎక్కువగా కొనేస్తున్నారు. మీరు కూడా మంచి బ్యాటరీ ఫోన్ కోసం చూస్తుంటే ఈ స్టోరీ మీకోసమే.. వినియోగదారుల అవసరాలను బట్టి స్మార్ట్ ఫోన్ కంపెనీలు (Top Smartphones 2026) ఇప్పుడు రెండు రోజుల వరకు ఛార్జింగ్ అందించే భారీ బ్యాటరీలను అందిస్తున్నాయి. ముఖ్యంగా 9000mAh కన్నా ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీలతో వచ్చే స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 2026లో 9000mAH బ్యాటరీతో లభ్యమయ్యే టాప్ స్మార్ట్‌ఫోన్లపై ఓసారి లుక్కేయండి.. వన్‌ప్లస్ నార్డ్ 6 : ఈ వన్‌ప్లస్ ఫోన్ 8GB + 256GB వేరియంట్ ధర రూ. 41,999కి కొనేసుకోవచ్చు. 12GB + 256GB వేరియంట్ ధర రూ. 46,999కి కొనేసుకోవచ్చు. ఇందులో 9,000mAh భారీ బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 6లో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 165Hz రిఫ్రెష్ రేట్, 3600 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. నార్డ్ 6 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరాలో OISతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. వివో T5 ప్రో 5 : భారత మార్కెట్లో ఇటీవలే ఈ వివో