
Harish Rao: కృతజ్ఞతకు.. ఆశ కు జరిగిన పోటీలో ఆశ గెలిచిందని.. నాడు కాంగ్రెస్ ప్రజలకు ఆశ చూపి నేడు మోసం చేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు మండిపడ్డారు.. చిన్నకోడూరు మండలం శంకరాయ కుంట లో బాలవికాస వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన సందర్బంగా మాట్లాడారు.. శంకరాయ కుంట గ్రామం కెసిఆర్ గారికి ఎంతో ప్రేమ ఉన్న గ్రామం.. గ్రామాన్ని గుర్తు చేస్తూ ఉంటారని చెప్పారు.. శంకరాయ కుంట గ్రామం చిన్నది అయిన.. మనసు మాత్రం పెద్దదే.. గతం లో ఓబుళపూర్ లో ఉండే మా గ్రామాన్ని గ్రామపంచాయతి చేయాలని కోరగానే కెసిఆర్ గారితో ప్రత్యేకించి చెప్పి నూతన గ్రామ పంచాయతీ గా చేసామన్నారు.. నేడు వాటర్ ప్లాంట్ ను ప్రారంభం చేసుకున్నాము..100 క్యాన్స్ పంపించాను..బిసి కమ్యూనిటీ హల్ నిర్మాణం చేసుకున్నాం..మీరు కోరగానే ఈ గ్రామం నుండే రింగ్ రోడ్డు పోయేల కృషి చేసిన..గ్రామం లోని నాగిరెడ్డి చెరువు కు కాళేశ్వరం నీళ్లు అందించాము.. ఇలా గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసుకున్నాం.. ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి భవిష్యత్ లో అన్ని పనులు ఒక్కొకటిగా పూర్తి చేసుకుందామన్నారు. నేడు ప్రారంబించుకున్నాం కానీ దాన్ని నిలబెట్టుకోవడం గ్రామ ప్రజల బాధ్యత అని అన్నారు.. నేడు ప్లాంట్ కోసం సేకరణ చేసిన డబ్బులు కూడ భవిష్యత్ లో ప్లాంట్ కాపాడుకునేందుకు ఉపయోగ పడుతాయన్నారు.. బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో కెసిఆర్ గారు కాళేశ్వరం నీళ్లు తెచ్చి, రైతు బందు ఇచ్చాము, రైతు బీమా ఇచ్చాము హాస్పిటల్ లో కెసిఆర్ కిట్ ఇచ్చాము ఇలా ఎన్నో చేసి కృతజ్ఞతగా ఉన్నాం.. కాంగ్రెస్ ప్రజలకు ఆశ చూపి మోసం చేసిందని మండి పడ్డారు.. కెసిఆర్ ఇచ్చిన 2వేల పెన్షన్ ను 4వేలు చేస్తా అని, రైతు బందు 15వేలు ఇస్తామని మహిళలకు 2500 ఇస్తా అని ఆశ చూపి దగా చేసిందన్నారు.. రైతు