
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందిన ‘కాక్టెయిల్ 2’ (Cocktail 2) చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. హోమీ అదజానియా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. జూన్ 19న 2 గంటల 30 నిమిషాల నిడివితో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. దీనికి జూన్ 14 అర్ధరాత్రి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. యూత్‌ఫుల్ కంటెంట్, కొత్త జోడీల కాంబినేషన్ వల్ల ‘కాక్టెయిల్ 2’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మడాక్ ఫిల్మ్స్ రూపొందిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, తారలు కృతిసనన్, రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలు పోషించారు. 12 ఏళ్ల కెరీర్లో కృతి సనన్‌కు ఇదే తొలి ‘ఏ’ రేటెడ్ చిత్రం. రష్మిక మందన్నకు హిందీలో ‘యానిమల్’ తర్వాత ఇది రెండో ‘ఏ’ సర్టిఫికెట్ మూవీ. ఇక షాహిద్ కపూర్‌కు ‘కమినే’, ‘ఉడ్తా పంజాబ్’, ‘కబీర్ సింగ్’, ‘ఓ రోమియో’ తర్వాత ఐదో ‘ఏ’ రేటెడ్ చిత్రమిది. ‘ఓ రోమియో’ ఆయన చివరి చిత్రం కావడంతో వరుసగా రెండు ‘ఏ’ రేటెడ్ సినిమాలు రావడం షాహిద్ కెరీర్లో ఇదే తొలిసారి. 2012లో విడుదలైన ‘కాక్టెయిల్’ తొలి భాగానికి యూఏ సర్టిఫికెట్ లభించగా, నిడివి 146 నిమిషాలు మాత్రమే. అంటే సీక్వెల్ 4 నిమిషాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో ‘ఏ’ సర్టిఫికెట్తో వస్తున్న ‘కాక్టెయిల్ 2’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం రాబడుతుందో చూడాలి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు