కొక్కిలగడ్డలో శ్రీ మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
Actor ProfilePolitician

కొక్కిలగడ్డలో శ్రీ మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
కొక్కిలగడ్డలో శ్రీ మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్
Telugu Times18 Jul 2026
కొక్కిలగడ్డలో శ్రీ మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్

మోపిదేవి: కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం, కొక్కిలగడ్డలో జడ్పీ పాఠశాల భవనాన్ని ప్రారంభించిన అనంతరం గ్రామంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి దేవాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ఆలయ పండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రి లోకేష్ కు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, తెనాలి శ్రావణ్ కుమార్, గళ్లా మాధవి, భాష్యం ప్రవీణ్, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, బోడె ప్రసాద్, మచిలీపట్నం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ, అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాస్, జోనల్ కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు