
బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కఠోర వాస్తవాన్ని అమెరికా కాంగ్రెస్ కమిటీ ఎదుట బయటపెట్టారు. తనకు మూడు వివాహేతర సంబంధాలు ఉన్నాయని అంగీకరించారు. తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి జెఫ్రీ ఎప్‌స్టీన్ ప్రయత్నించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కమిటీ ఎదుట బిల్‌గేట్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిజాన్ని బయటపెట్టారు. తనకు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఒప్పుకున్నారు. తన బలహీనతను అడ్డుపెట్టుకుని ఎప్‌స్టీన్ బ్లాక్‌మెయిల్‌కు ప్రయత్నించారని ఆరోపించారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన జెఫ్రీ ఎప్ స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసాయి. జూన 10న జరిగిన ఈ విచారణకు సంబంధించిన అధికారిక ట్రాన్స్‌క్రిప్ట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్.. బిల్ గేట్స్ వివాహేతర సంబంధాల గురించి తెలుసుకుని, ఆయనను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఆయనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలపై అమెరికా హౌస్ ఓవర్‌సైట్ కమిటీ ఈ విచారణ చేపట్టింది. ప్రస్తుతం 70 ఏళ్ల బిల్ గేట్స్.. విచారణలో ముగ్గురు మహిళల పేర్లను ప్రస్తావించారు. రష్యాకు చెందిన బ్రిడ్జ్ గేమ్ ప్లేయర్ మిలా ఆంటోనోవా, అణు శాస్త్రవేత్త కరిమా నిగ్మతులీనా, డాక్టర్ ఆలిస్ జాకబ్స్ తో తనకు సంబంధాలు ఉన్నాయని తెలిపారు. గతంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, జెఫ్రీ ఎప్‌స్టీన్ మధ్య సంబంధాలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తనకున్న పరిచయంపై గేట్స్ స్పందిస్తూ.. తామిద్దరం 2011 నుంచి 2014 మధ్య కాలంలో సుమారు 12 నుంచి 14 సార్లు ప్రత్యక్షంగా, రెండుసార్లు స్కైప్ కాల్స్ ద్వారా మాట్లాడుకున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు పెద్ద పెద్ద దాతల నుంచి నిధులు సేకరించే ఉద్దేశంతోనే అతడిని కలిశానని చెప్పారు. అప్పటికే ఎప్‌స్టీన్ లైంగిక నేరస్థుడిగా శిక్ష అనుభవించాడని తెలిసినప్పటికీ, అతడిని కలవడం తాను చేసిన పెద్ద పొరపాటని గేట్స్ అంగీకరించారు. దాతలను తీసుకువస్తానన్న ఎప్‌స్టీన్ మాటలు