ఓటరు సవరణ పగడ్బందీగా నిర్వహించాలి
Actor ProfilePolitician

ఓటరు సవరణ పగడ్బందీగా నిర్వహించాలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఓటరు సవరణ పగడ్బందీగా నిర్వహించాలి
Namasthe Telangana14 Jul 2026
ఓటరు సవరణ పగడ్బందీగా నిర్వహించాలి

భూదాన్ పోచంపల్లి, జూన్ 24 : ఓటర్ల జాబితా సవరణను బిఎల్‌వోలు పకడ్బందీగా నిర్వహించాలని భూదాన్ పోచంప‌ల్లి మండల తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం జలాల్‌పూర్ గ్రామం స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి బీఎల్‌వోలు, సూప‌ర్‌వైజ‌ర్ల‌కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే సర్వేకి సంబంధించిన కిట్లు, ఫారాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా అర్హులందర్నీ ఓటరు జాబితాలో చేర్పించాలన్నారు. బూత్ పరిధిలోని ఇండ్లకు వెళ్లి అర్హులైన ఓటరు సమాచారాన్ని అధికారులకు అందించాలని సూచించారు. [caption id="attachment_2430078" align="alignnone" width="1200"] 'ఓటరు సవరణ పగడ్బందీగా నిర్వహించాలి'[/caption] ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, డిస్టిక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ కడారి నర్సిరెడ్డి, అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్ వియ్యాల భిక్షమయ్య, ఆర్.ఐ లు సుధాకరరావు, సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భారత లవ కుమార్, మండల అధ్యక్షుడు ఉప్పునూతల వెంకటేష్ యాదవ్, నాయకులు కొట్టం కరుణాకర్ రెడ్డి, చిలువేరు బాల నరసింహ, కుడికాల బలరాం, గోడల ప్రభాకర్, మేకల చొక్కా రెడ్డి, జెల్ది నరసింహ, ముప్పిడి శ్రీనివాస్, భారత గిరివాస్, కొంక భాను, పగిడిమర్రి రాజు పాల్గొన్నారు. [caption id="attachment_2430076" align="alignnone" width="1200"] 'ఓటరు సవరణ పగడ్బందీగా నిర్వహించాలి'[/caption]