ఓటీటీలో సేవ్ ది టైగర్స్ 3’ సరికొత్త రికార్డులు.. సౌత్ డిజిటల్ స్పేస్ ను షేక్ చేస్తున్న మహి
Actor ProfileCelebrity

ఓటీటీలో సేవ్ ది టైగర్స్ 3’ సరికొత్త రికార్డులు.. సౌత్ డిజిటల్ స్పేస్ ను షేక్ చేస్తున్న మహి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఓటీటీలో సేవ్ ది టైగర్స్ 3’ సరికొత్త రికార్డులు.. సౌత్ డిజిటల్ స్పేస్ ను షేక్ చేస్తున్న మహి
Samayam Telugu28 Jun 2026
ఓటీటీలో సేవ్ ది టైగర్స్ 3’ సరికొత్త రికార్డులు.. సౌత్ డిజిటల్ స్పేస్ ను షేక్ చేస్తున్న మహి

తెలుగు డిజిటల్ వినోద రంగంలో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసిన మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ తాజాగా మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనాలు సృష్టిస్తోంది. జూన్ 19న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’లో విడుదలైన ‘సేవ్ ది టైగర్స్ 3’ స్ట్రీమింగ్ అయిన కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయి వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజిటల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, ఓటీటీ మార్కెట్‌లో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.* 'సేవ్ ది టైగర్స్ 3' మూవీ రివ్యూ సాధారణంగా ఏదైనా ఒక వెబ్ సిరీస్‌కు వరుసగా సీజన్లు వస్తున్నప్పుడు.. ఆడియన్స్‌లో అంచనాలు పెరిగిపోయి, మేకర్స్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చాలాసార్లు తదుపరి సీజన్లు ఆశించిన స్థాయిలో మెప్పించలేవు. కానీ, ‘సేవ్ ది టైగర్స్’ ఫ్రాంచైజీ మాత్రం ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసింది. గత రెండు సీజన్ల క్రేజ్‌ను పక్కాగా వాడుకుంటూనే, అంతకు మించిన వినోదంతో సీజన్ 3ని మరింత పవర్‌ఫుల్‌గా స్క్రీన్‌పై ప్రెజెంట్ చేశారు. ఈ సిరీస్ సక్సెస్‌తో టాలెంటెడ్ మేకర్, షోరన్నర్ మహి వి రాఘవ్ తన సత్తాను మరోసారి చాటుకున్నారు. ఇప్పటికే ‘సేవ్ ది టైగర్స్’ మొదటి రెండు భాగాలు, అలాగే డార్క్ థ్రిల్లర్ సిరీస్ ‘సైతాన్’ వంటి ప్రాజెక్టులతో ఓటీటీ ప్రపంచంలో తిరుగులేని హిట్ ట్రాక్‌లో ఉన్న ఆయన, ఇప్పుడు హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఒక కథను కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా, లాంగ్ ఫార్మాట్‌లో ఆకట్టుకునేలా నడిపించడంలో మహి వి రాఘవ్ ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తున్నారు. గతంలో వెండితెరపై ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ వంటి విభిన్న చిత్రాలను అందించిన ఆయన, డిజిటల్ స్క్రీన్‌పై ఒక ఫ్రాంచైజీని సక్సెస్‌ఫుల్‌గా ఎలా రన్ చేయాలో నిరూపించారు. ఈ సందర్భంగా మహి వి రాఘవ్ మాట్లాడుతూ.. మన దేశంలో హాలీవుడ్ లేదా కొరియన్ టీవీ సిరీస్‌ల