
ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ కుమార్తె పెళ్లి ఘనంగా జరిగింది. గురువారం రాత్రి గోవాలోని ఓ రిసార్ట్‌లో ఈ శుభకార్యం జరగ్గా.. చిరంజీవి, నాగార్జున, త్రిష తదితరులు హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. వీళ్లకు


ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూ కుమార్తె పెళ్లి ఘనంగా జరిగింది. గురువారం రాత్రి గోవాలోని ఓ రిసార్ట్‌లో ఈ శుభకార్యం జరగ్గా.. చిరంజీవి, నాగార్జున, త్రిష తదితరులు హాజరై నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. వీళ్లకు

ఓటీటీల్లోకి ఈ వారం బ్లాస్ట్, రాజా శివాజీ, అవతార్ 3 లాంటి సినిమాలు వచ్చేశాయి. వీటితో పాటు 'ద షీప్ డిటెక్టివ్స్' అనే హాలీవుడ్ డబ్బింగ్ మూవీ కూడా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉన్న ఈ సినిమాని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌కు కాస్త కామెడీ జోడించి తీశారు. ఇంతకీ ఇదెలా ఉందనేది రివ్యూలో చూద్దాం. (ఇదీ చదవండి: జైలులో హీరో దర్శన్.. కారు యాక్సిడెంట్ వివాదంలో కొడుకు) కథేంటి? జార్జ్(హ్యూ జాక్‌మన్) ఓ గొర్రెల కాపరి. డెన్‌బ్రూక్ అనే చిన్న పల్లెటూరిలో జీవిస్తుంటాడు. అయితే రాత్రి పడుకోవడానికి ముందు గొర్రెలకు తన దగ్గరుండే డిటెక్టివ్ నవలలు చదివి వినిపిస్తుంటాడు. అయితే ఆ గొర్రెలకు ఈ కథలన్నీ అర్థమవుతున్నాయనే సంగతి జార్జ్‌కి తెలియదు. ఇదిలా ఉండగా ఓ రోజు రాత్రి జార్జ్‌ని ఎవరో చంపేస్తారు. ఈ కేసుని ఓ పోలీస్ దర్యాప్తు చేస్తుంటాడు. మరోవైపు గొర్రెలన్నీ డిటెక్టివ్‌గా మారి తన కాపరిని ఎవరో చంపారో తెలుసుకునే ప్రయత్నం చేస్తాయి. చివరకు హంతకుడు దొరికాడా? లేదా? అసలు జార్జ్‌ని ఎవరు ఎందుకు చంపారనేది మిగతా స్టోరీ. ఎలా ఉందంటే? ఇప్పటివరకు మీరెన్ని మర్డర్ మిస్టర్ థ్రిల్లర్స్ చూసే ఉంటారు. వాటన్నింటిలోనూ పోలీసులు లేదా ప్రైవేట్ డిటెక్టివ్స్, చుట్టూ పక్కన ఉండే వాళ్లలో ఎవరో ఒకరు పరిష్కరించడం లాంటివి చూసుంటారు. కానీ ఇందులో మాత్రం గొర్రెలు.. ఓ హత్య కేసుని పరిష్కరించేందుకు చాలా సహాయపడతాయి. వినడానికి విచిత్రంగా ఉంది కదా! కానీ పెద్దగా హడావుడి లేకుండా సరదాగా మూవీ తీసేశారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అనగానే ఏదేదో ట్విస్టులు ఊహించేసుకుంటాం కదా. ఇందులో హత్య చేసింది ఎవరు? అనే ట్విస్ట్ ఉంటుంది గానీ దానికంటే గొర్రెలు, మనుషుల్లా మాట్లాడుకోవడం.. తమ కాపరి ఇప్పటివరకు చదివి వినిపించిన డిటెక్టివ్ పుస్తకాల్లోని స్టోరీల ఆధారంగా ఈ కేసుని ఛేదించేందుకు ప్రయత్నం చేయడం లాంటివి ఫన్నీగా