ఓటీటీలోకి అబ్సెషన్ ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Actor ProfileCelebrity

ఓటీటీలోకి అబ్సెషన్ ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఓటీటీలోకి అబ్సెషన్ ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Eenadu11 Aug 2026
ఓటీటీలోకి అబ్సెషన్ ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

ఇంటర్నెట్‌ డెస్క్: హాలీవుడ్‌లోనే కాదు.. విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ సంచలనం సృష్టించిన చిత్రం ‘అబ్సెషన్‌’ (Obsession). చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడీ హారర్‌ థ్రిల్లర్‌ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. యాపిల్‌ టీవీ వేదికగా జూన్‌ 30 నుంచి అందుబాటులోకి రానుంది. ఈ చిత్రం ఓటీటీపై ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ తాజాగా యాపిల్‌ టీవీ అప్‌డేట్‌ను పంచుకుంది. 2026లో భారత్‌లో విడుదలైన హాలీవుడ్‌ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ‘అబ్సెషన్’ నిలిచింది. రూ.7 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం ఒక్క మన దేశంలోనే రూ.77 కోట్లకు పైనే కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఇదీ అబ్సెషన్‌ కథ..: బారోన్‌ అలియాస్‌ బేర్ (మైఖేల్‌ జాన్‌స్టన్‌) మ్యూజిక్ స్టోర్ ఉద్యోగి. స్నేహితురాలు నిక్కీ ఫ్రీమెన్‌ (ఇండీ నవరెట్టే) అంటే ఎంతో ఇష్టం. తన ప్రేమను వ్యక్తపరిస్తే ఆమె అంగీకరిస్తుందో లేదోనని భయంతో చెప్పకుండా ఉండిపోతాడు. ఆమే తనను ప్రేమిస్తే బాగుంటుందని ఆశపడతాడు. ఈ క్రమంలోనే కోర్కెలు నెరవేర్చే ఓ వింత స్టిక్‌ని కొంటాడు. దాన్ని విరగ్గొట్టి మనసులో ఏదైనా అనుకుంటే అది నెరవేరుతుంది. ఈ మాయా స్టిక్‌ను విరగ్గొట్టి ‘ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నన్ను నిక్కీ ప్రేమించాలి’ అని కోరుకుంటాడు. దాని ప్రభావంతో బేర్‌ను నిక్కీ ప్రేమించడం మొదలు పెడుతుంది. దీంతో బేర్‌ ఆనందానికి కూడా హద్దులు ఉండవు. మొదట్లో బాగున్నా, రోజులు గడిచే కొద్దీ నిక్కీ ప్రేమ హద్దులు దాటుతుంది. ఆ తర్వాత ఏమైంది?బేర్‌ కోసం నిక్కీ ఏం చేస్తుంది? చివరికీ ఇద్దరూ ఏమవుతారు అనేది కథ. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి