ఓజీ బ్యూటీ డీ
Actor ProfileActor

ఓజీ బ్యూటీ డీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఓజీ బ్యూటీ డీ-గ్లామర్ రోల్లో! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema30 Jun 2026
ఓజీ బ్యూటీ డీ-గ్లామర్ రోల్లో! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

గ్లామర్ డాల్‌గా, లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల మనసులు దోచుకున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Mohan) ఇప్పుడు తన కెరీర్‌లోనే అత్యంత సాహసోపేతమైన నిర్ణయంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్, హీరో శింబు కాంబినేషన్‌లో వస్తున్న ‘అరసన్’ (Arasan) సినిమాలో ఆమె ఎవరూ ఊహించని విధంగా పూర్తి డీ-గ్లామరైజ్డ్ రోల్‌లో కనిపించనుంది. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో కేవలం పాటలకే పరిమితమయ్యే హీరోయిన్ పాత్రలకి భిన్నంగా, నార్త్ చెన్నై మురికివాడల నేపథ్యంలో సాగే ఈ రియలిస్టిక్ డ్రామాలో ఆమె లుక్, క్యారెక్టరైజేషన్ సరికొత్తగా ఉండబోతున్నాయి. తన రెగ్యులర్ మేకప్, హంగులను పక్కనబెట్టి, పాత్రకు తగ్గట్టుగా చాలా సహజంగా కనిపించడానికి ప్రయత్నిస్తోంది ప్రియాంక మోహన్. వెట్రిమారన్ సినిమాల్లో మహిళాపాత్రలు ఎంత బలంగా, కథను మలుపు తిప్పేలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘అరసన్’ చిత్రంలో కూడా ప్రియాంక పాత్ర అలాంటిదే అంటున్నారు. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ మొదలైంది. ప్రియాంక కూడా సెట్స్ లో జాయిన్ అయింది. ఆమె సెట్స్ పైకి వచ్చిన తర్వాతే, అది డీ-గ్లామర్ రోల్ అనే విషయం బయటకొచ్చింది. విజయ్ సేతుపతి, సముద్రఖని లాంటి విలక్షణ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని కలైపులి థాను నిర్మిస్తుండగా, అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు