
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ-2లో ప్రభాస్ సాహో పాత్రతో ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంత కాలంగా మన సౌత్ సినిమా ఆలోచనా విధానంలో, తెరకెక్కించే విధానంలో భారీ మార్పులు రావడం మనకు స్పష్టంగా కనిపిస్తున్న వాస్తవం. ఒకప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే.. అదే ఒక పెద్ద పండగ. అలాంటి మల్టీ స్టారర్ సినిమాలతో మొదలైన ఈ సరికొత్త ట్రెండ్.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ క్రాస్ ఓవర్స్ వరకు చేరుకుంది. గతంలో తీసిన ఒక బ్లాక్ బస్టర్ సినిమాలోని పాత్రలను, కథను.. కొత్తగా రాబోతున్న మరో సినిమాతో ఇంటర్ లింక్ చేయడం ఇప్పుడు నయా ట్రెండ్. పాత సినిమాలోని స్టార్ హీరోలను సర్ ప్రైజ్ ఎంట్రీగా కొత్త సినిమాలోకి తీసుకువస్తూ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నారు. ఈ ట్రెండ్ మనకు పాతదే అయినా.. ఈ తరం స్టార్ హీరోలు ఇగోలు పక్కనపెట్టి మరీ ఇలాంటి ప్రయోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం నిజంగా అద్భుతం. సరిగ్గా చెప్పాలంటే, ఈ క్రాస్ ఓవర్, యూనివర్స్ ట్రెండ్‌ను మన దగ్గర సాలిడ్ గా మొదలుపెట్టింది కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj). విక్రమ్ లాంటి భారీ యాక్షన్ సినిమాలో, కార్తీ ఖైదీ సినిమాను ఇంటర్ లింక్ చేస్తూ ఆయన తెరకెక్కించిన సీన్స్ థియేటర్లలో కూర్చున్న ప్రతి ఒక్కరికీ గూస్ బంప్స్ తెప్పించాయి. ఆ ఒక్క దెబ్బతో సినిమాటిక్ యూనివర్స్ అనే పదానికి సౌత్ ఇండియాలో ఎనలేని క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు సరిగ్గా అలాంటి అద్భుతమైన క్రాస్ ఓవరే టాలీవుడ్ లోనూ రాబోతోంది. ఈ సారి ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది మన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో బాహుబలి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుజిత్ (Sujeeth) తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ సాహో. ఈ