ఓజీ 2’.. దానయ్య తప్పుకోవడానికి కారణమేంటి
Actor ProfileActor

ఓజీ 2’.. దానయ్య తప్పుకోవడానికి కారణమేంటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఓజీ 2’.. దానయ్య తప్పుకోవడానికి కారణమేంటి
Chitrajyothy8 Jul 2026
ఓజీ 2’.. దానయ్య తప్పుకోవడానికి కారణమేంటి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘ఓజీ’. త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోన్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్ నిర్మాణ బాధ్యతల నుంచి డివివి దానయ్య తప్పుకోవడంతో.. కొత్తగా వేరే సంస్థలు వచ్చి చేరాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మైల్‌స్టోన్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘ఓజీ’ (OG Movie). దర్శకుడు సుజీత్ స్టైలిష్ టేకింగ్, పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ లుక్ ఆయన చూపించిన విధానం.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం సాధించిన భారీ విజయంతో దీనికి సీక్వెల్ ‘ఓజీ 2’కి కూడా ఎప్పుడో లైన్ క్లియర్ అయిపోయింది. అయితే, ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మొదటి భాగాన్ని ఎక్కడా రాజీ పడకుండా, భారీ బడ్జెట్‌తో నిర్మించి.. అటు థియేటర్స్, ఇటు ఓటీటీ ద్వారా భారీగా ప్రాఫిట్స్ పొందిన ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య (DVV Danayya), ఈ ‘OG 2’ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి డి.వి.వి. దానయ్య ‘OG’ మొదటి పార్ట్ కోసం భారీగానే ఖర్చు పెట్టారు. పొలిటికల్‌గా పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నప్పటికీ, ఆయనకు ఇబ్బంది రాకుండా అన్ని విషయాలను జాగ్రత్తగానే చూసుకున్నారు. సినిమాపై ఆయన పెట్టుకున్న నమ్మకం నిజమై.. సినిమా విడుదల తర్వాత కాసుల వర్షం కూడా కురిసింది. దీని తర్వాత సుజీత్ దర్శకత్వంలోనే నేచురల్ స్టార్ నాని హీరోగా మరో సినిమాను నిర్మించేందుకు ఆయన రెడీ అయ్యారు. కొన్ని కారణాల వల్ల నాని-సుజీత్ ప్రాజెక్ట్ చేతులు మారడం, అలాగే ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని అంతర్గత పరిణామాల నేపథ్యంలో.. ‘OG 2’ సీక్వెల్ నిర్మాణం నుంచి కూడా దానయ్య ఎగ్జిట్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా టాక్