ఓజీ 2 కథ ఇదే
Actor ProfileActor

ఓజీ 2 కథ ఇదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఓజీ 2 కథ ఇదే, సుజీత్ కి డేట్స్ ఇచ్చేసిన పవన్ .. ఈ సారి ఎంత ఊహించుకున్నా
Asianet News Telugu19 Jul 2026
ఓజీ 2 కథ ఇదే, సుజీత్ కి డేట్స్ ఇచ్చేసిన పవన్ .. ఈ సారి ఎంత ఊహించుకున్నా

పవన్‌ కళ్యాణ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ `ఓజీ` మూవీ. ఇది సుమారు మూడు వందల కోట్లు వసూలు చేసింది. దీనికి దర్శకుడు సుజీత్‌ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటించగా, ప్రకాష్‌ రాజ్‌, అర్జున్‌ దాస్‌, శ్రియా రెడ్డి వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ గతేడాది విడుదలైన విషయం తెలిసిందే. అదిరిపోయే విజయాన్ని సాధించి పవన్‌ కళ్యాణ్‌కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. ఆయన రేంజ్‌ ఏంటో చూపించిందీ మూవీ. ఇప్పుడు దీనికి సీక్వెల్‌ పార్ట్ 2 రాబోతుంది. `ఓజీ2` ఉండబోతుందని ఆ మూవీ ఎండ్‌ కార్డ్ లోనే వెల్లడించారు. కానీ ఇంత త్వరగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. తాజాగా పవన్‌ కళ్యాణ్‌ `ఓజీ 2`కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీన్ని పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్ లో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా ఎప్పుడుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో కన్ఫమ్‌ చేశారు. త్వరలోనే ఈ మూవీ ఉండబోతుందని తెలిపారు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు సినిమా చేద్దామని పవన్‌ కళ్యాణ్‌.. దర్శకుడు సుజీత్‌కి హామీ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఓ వీడియోని విడుదల చేశారు. ఇందులో దర్శకుడు సుజీత్‌.. పవన్‌కి సినిమా కథని వివరిస్తున్నారు. అదే సమయంలో సినిమా కాన్సెప్ట్ ని రిఫ్లెక్ట్ చేసేలా కార్టూన్‌ బొమ్మలతో ఒక బుక్‌ని తయారు చేశారు. అది చూసి పవన్‌ మురిసిపోయారు. చాలా ఎగ్జైట్‌. మీ పేరు ఏంటి అని అడిగితే.. ఓజాస్‌ గాంభీర అని హీరో చెబుతాడు, అదే సినిమా ఫస్ట్ షాట్‌ అని తెలిపారు సుజీత్‌. దీంతో పవన్‌ చాలా ఇంప్రెస్ట్ అయ్యాడు. అయితే గాంభీర ఫ్యామిలీ మన ఇండియా నుంచి జపాన్‌ యుద్ధానికి వెళ్లడం, అక్కడే సెటిల్‌ కావడం, గాంభీరం అక్కడ స్థానికంగా సమురాయ్‌గా ఎదగడం, అక్కడి పోలీసుల నుంచి ఇతర సమురాయ్స్ నుంచి ప్రమాదం