ఒకరి నష్టాన్ని మీ హెడ్ లైన్ గా మార్చుకోకండి... మిత్రుడి మరణం వేళ నటి పోస్ట్
Actor ProfileActor

ఒకరి నష్టాన్ని మీ హెడ్ లైన్ గా మార్చుకోకండి... మిత్రుడి మరణం వేళ నటి పోస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఒకరి నష్టాన్ని మీ హెడ్ లైన్ గా మార్చుకోకండి... మిత్రుడి మరణం వేళ నటి పోస్ట్
Eenadu15 Aug 2026
ఒకరి నష్టాన్ని మీ హెడ్ లైన్ గా మార్చుకోకండి... మిత్రుడి మరణం వేళ నటి పోస్ట్

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిగ్‌బాస్‌ కన్నడ ఫేం, నటి కృషి తాపండ నివాసంలో ఆమె స్నేహితుడు వైశాఖ్‌ విగతజీవిగా కన్పించడం కర్ణాటక వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతడి మృతిపై కొద్ది రోజులుగా నెట్టింట పలు రకాలుగా ప్రచారం జరుగుతోంది. నటిని టార్గెట్‌ చేసేలా కొంతమంది పోస్టులు పెట్టడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కృషి తాపండా (Krishi Thapanda) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ భావోద్వేగభరిత పోస్ట్‌ పెట్టారు. ఒకరి మరణం ఆ వ్యక్తి కుటుంబానికి తీరని లోటు అని.. అలాంటి ఘటనలపై బాధ్యతారహితంగా వ్యవహరించొద్దని హితవు పలికారు. ‘‘ఇలాంటి పోస్ట్‌ చేయాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. నాపై నిరంతరంగా వినిపిస్తోన్న వదంతులు, ఒత్తిడి, నేను, నా కుటుంబం ఎదుర్కొంటోన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఈ పోస్ట్‌ చేస్తున్నా. కొన్ని రోజుల క్రితం నా జీవితం ఊహించని విధంగా మలుపు తిరిగింది. నా మనసుకు ఎంతో దగ్గరైన, నాకు అన్ని వేళలా అండగా ఉండే మిత్రుడిని కోల్పోయా. అతడి మరణం నాకు తీరని లోటు. ఈ బాధలో నేను ఉంటే.. అంతకంటే దారుణమైన సంఘటనలు ఎదురవుతున్నాయి. ఓ వ్యక్తి మరణిస్తే.. దానిపై వదంతులు, ఊహాగానాలతో కొందరు తమకు నచ్చిన కథలు సృష్టిస్తున్నారు. నేను కన్పిస్తే చాలు.. ‘మీ స్పందన ఏంటీ?’ అంటూ అర్థం లేకుండా అడుగుతున్నారు’’ ‘‘ఇలాంటి ఊహాగానాలు సృష్టించే వారికి.. చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. ఒకరి నష్టాన్ని మీ హెడ్‌లైన్‌గా మార్చుకోకండి. అక్కడ ఓ కుటుంబం కొడుకును కోల్పోయింది. మేమంతా ఓ మంచి స్నేహితుడిని కోల్పోయాం. ఇలాంటి పరిస్థితుల్లో మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేలా ప్రవర్తించొద్దు ప్లీజ్‌. మీరు చేసే అసత్య ప్రచారాలు.. బాధలో ఉన్నవారికి మరింత నష్టం కలిగిస్తాయి. మీ వల్ల ఇతరులు సంతోషంగా ఉండకపోయినా ఫర్వాలేదు.. కానీ ఇంకొకరి కన్నీళ్లకు మీరు కారణం కావొద్దు. నా మిత్రుడి ఆత్మకు శాంతి కలిగేలా ప్రవర్తిస్తారని కోరుకుంటున్నా. ఇకనైనా ఇలాంటి ప్రచారాలు ఆపాలని