ఒకప్పుడు .. ఇప్పుడు
Actor ProfilePolitician

ఒకప్పుడు .. ఇప్పుడు

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
ఒకప్పుడు .. ఇప్పుడు స్వర్ణగిరి
Eenadu14 Jul 2026
ఒకప్పుడు .. ఇప్పుడు స్వర్ణగిరి

ప్రైవేటు గోల్డ్‌ మైనింగ్‌ను ప్రారంభించడం శుభపరిణామం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలులోని జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘జొన్నగిరిని గతంలో

ఒకప్పుడు .. ఇప్పుడు
Andhra Jyothy13 Jul 2026
ఒకప్పుడు .. ఇప్పుడు

ఏపీలో సువర్ణ అధ్యాయం మొదలైందని.. రాయలసీమ రతనాలసీమగా మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ప్లాంట్‌ను సీఎం ప్రారంభించారు. కర్నూల్‌, జూన్ 24: ఏపీలో సువర్ణ అధ్యాయం మొదలైందని.. రాయలసీమ రతనాలసీమగా మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు(బుధవారం) జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ప్లాంట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జొన్నగిరి గోల్డ్‌ మైన్‌తో ఇక్కడి ప్రజల జీవితాలు మారుతాయన్నారు. గతంలో జొన్నగిరిని స్వర్ణగిరిగా పిలిచేవారని.. మన దగ్గర కూడా బంగారం ఉత్పత్తి కాబోతోందని తెలిపారు. భవిష్యత్‌లో దేశమంతా జొన్నగిరి గురించే మాట్లాడుతుందని వెల్లడించారు. ఒకప్పుడు KGF.. ఇప్పుడు JGF అని ముఖ్యమంత్రి అన్నారు. చమురు తర్వాత దేశంలో ఎక్కువ దిగుమతి అయ్యేది బంగారమే అని తెలిపారు. రాయలసీమలో సిరులు పండించేందుకు శరవేగంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ప్రస్తుతం 400 కిలోల సామర్థ్యంతో బంగారం ఉత్పత్తి అవుతుందని, భవిష్యత్‌లో 1000 కిలోల బంగారం ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. రెండో యూనిట్‌తో కలిపి 50 టన్నుల బంగారం ఉత్పత్తి అవుతుందన్నారు. ఇప్పటికే 800 మందికి ఉద్యోగాలు లభించాయని.. త్వరలో మరో 1500 మందికి ఉపాధి లభించనుందన్నారు. భవిష్యత్‌లో 5 వేల మందికి స్వర్ణగిరి గోల్డ్‌ మైన్స్‌లో ఉపాధి లభిస్తుందని సీఎం పేర్కొన్నారు. సాయికృష్ణ ఘటనపైనా కుల రాజకీయం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్‌పై ఇష్టానుసారం నోరుపారేసుకున్నారని తెలిపారు. సాయికృష్ణ కేసులో లబ్ధి పొందాలని చూశారని.. గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడంలో గొడ్డలి పార్టీ నాయకుడు దిట్ట అంటూ వ్యాఖ్యానించారు. కులమతాల పేరుతో గొడ్డలి పార్టీ విషం చిమ్ముతోందన్నారు. నేరాలు, ఘోరాలు చేసి రాజకీయ రంగు పులుముతున్నారని ఫైర్ అయ్యారు. రప్పా రప్పా రాజకీయం తప్ప గొడ్డలి పార్టీ చేసిందేమీలేదన్నారు. మళ్లీ వస్తాం.. గొడ్డలితో రప్పా రప్పా ఆడిస్తామంటున్నారని సీఎం