
బాలీవుడ్‌లో ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా.. మోడలింగ్‌పై నమ్మకంతో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి దిశా పటానీ. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా మార్షల్ ఆర్ట్స్.. యాక్షన్ స్టంట్స్‌లోనూ అదరగొడుతూ.. దర్శకురాలిగా కొత్త ప్రయాణాలు చేస్తూ దూసుకుపోతోంది. బాలీవుడ్‌లో ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా.. మోడలింగ్‌పై నమ్మకంతో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి దిశా పటానీ. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా మార్షల్ ఆర్ట్స్.. యాక్షన్ స్టంట్స్‌లోనూ అదరగొడుతూ.. దర్శకురాలిగా కొత్త ప్రయాణాలు చేస్తూ దూసుకుపోతోంది. జూన్ 13న పుట్టిన రోజును జరుపుకొన్న దిశ.. వరుస పాన్ ఇండియా సినిమాలతో కెరీర్‌లో అత్యంత కీలక దశలో ఉంది. ఈ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన దిశా పటానీ చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ రంగంపై మక్కువ పెంచుకుంది. మిస్ ఇండియా పోటీల్లో రన్నర్‌పగా నిలిచిన తర్వాత ఆమెకు ప్రకటనల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఒక ప్రముఖ డెయిరీ బ్రాండ్ యాడ్‌లో ఆమె అమాయకత్వంతో కూడిన నవ్వు దేశవ్యాప్తంగా చాలామందిని ఆకట్టుకుంది. ఆ గుర్తింపుతోనే ఆమెకు సినిమా అవకాశాలు తలుపుతట్టాయి. సినీ పరిశ్రమ నేపథ్యం లేని కుటుంబం నుంచి రావడంతో ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించిన ‘లోఫర్’ సినిమాతో వెండితెరకు పరిచమైంది. ఈ మూవీలో ఆమె వరుణ్‌తేజ్ సరసన నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఆమె నటించిన మొదటి చిత్రం ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’. ఈ సినిమాలో ధోనీ తొలి ప్రేయసి ప్రియాంక ఝా పాత్రలో నటించింది. ఇందులో ఆమె స్క్రీన్ టైం తక్కువగా ఉన్నప్పటికీ, తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్రవేసింది. ఆ సినిమా విజయం ఆమెకు బాలీవుడ్‌లో మంచి పునాది వేసింది. అలాగే, ప్రభాస్ హీరోగా వచ్చిన భారీ సైన్స్ ఫిక్షన్