
సినీ చరిత్రలో ఒకే కథను ఇద్దరు టాప్ డైరెక్టర్లు తమ స్టైల్‌లో తీసి, రెండు సినిమాలనూ సూపర్ హిట్ చేసిన సందర్భాలు చాలా అరుదు. ఆ జాబితాలోనివే 'ఒరు ఖైదియిన్ డైరీ' (తమిళం), దాని హిందీ రీమేక్ 'ఆఖ్రీ రాస్తా'. 1985లో వచ్చిన 'ఒరు ఖైదియిన్ డైరీ'కి కథ, స్క్రీన్‌ప్లేను భాగ్య రాజ్ అందించారు. ఈ కథను భారతీరాజా తనదైన ఎమోషనల్ టచ్‌తో డైరెక్ట్ చేశారు. కమల్ హాసన్ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో రేవతి, రాధ, జనగరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించింది. భాగ్యరాజ్ ఈ కథను భారతీరాజాకు ఇచ్చినప్పుడు, 'ఇది నా కథే అయినా, మీ స్టైల్‌కు తగ్గట్టుగా మార్పులు చేసుకోండి' అని చెప్పారట. ఆ తర్వాత భారతీరాజా తన మార్క్ దర్శకత్వంతో 'ఒరు ఖైదియిన్ డైరీ'ని బ్లాక్‌బస్టర్ చేశారు. తమిళంలో హిట్టయిన ఈ కథను హిందీలో తానే డైరెక్ట్ చేయాలని భాగ్యరాజ్ నిర్ణయించుకున్నారు. హీరోగా అమితాబ్ బచ్చన్ అయితేనే సరిపోతారని భావించి, నేరుగా ఆయనకే కథ వినిపించారు. కథ నచ్చడంతో అమితాబ్ వెంటనే ఓకే చెప్పారు. అయితే, సినిమా మొదలుపెట్టే ముందే భాగ్యరాజ్ ఒక కండిషన్ పెట్టారు. 'తమిళంలో భారతీరాజా ఆయన స్టైల్‌లో తీశారు. కానీ హిందీలో నేనే డైరెక్ట్ చేస్తున్నాను కాబట్టి, సినిమా మొత్తం నా మార్క్‌తోనే ఉంటుంది' అని అమితాబ్‌కు స్పష్టంగా చెప్పారట. దీనికి బిగ్ బీ కూడా అంగీకరించారు. ఆ తర్వాత జయప్రద, శ్రీదేవి హీరోయిన్లుగా 'ఆఖ్రీ రాస్తా' మొదలైంది. తమిళ వెర్షన్‌తో పోలిస్తే హిందీలో చాలా మార్పులు చేశారు. ముఖ్యంగా తండ్రీకొడుకుల మధ్య వచ్చే సీన్లు, హీరో ఇంగ్లీష్ నాలెడ్జ్‌తో కూడిన ఎమోషనల్ సీన్లను కొత్తగా యాడ్ చేశారు. అంతేకాదు, రెండు సినిమాల క్లైమాక్స్‌లు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. తమిళంలో ఉన్న క్లైమాక్స్‌నే హిందీలో కూడా వాడదామని అమితాబ్ బచ్చన్ సూచించారట. కానీ