ఒక్కటేనా.. వాటికి కూడా మోక్షం దొరికేనా
Actor ProfileCelebrity

ఒక్కటేనా.. వాటికి కూడా మోక్షం దొరికేనా

Total News1
Movie Updates0
Sources1
ఒక్కటేనా.. వాటికి కూడా మోక్షం దొరికేనా
TV9 Telugu14 Jun 2026
ఒక్కటేనా.. వాటికి కూడా మోక్షం దొరికేనా

పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా ఉన్న బిజీ చూసాక ఆయన నుంచి సినిమాలు ఇప్పట్లో రావడం కష్టమే అని అభిమానులు కూడా ఫిక్సైపోయారు.. ఆశలు వదిలేసుకున్నారు కూడా. కానీ అడక్కుండానే అప్‌డేట్ ఇచ్చి వాళ్లలో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నారు ఓజి మేకర్స్. అంతా ఓకే కానీ OG 2 వరకేనా.. మిగిలిన దర్శకులకు కూడా పవన్ ఓకే చెప్తున్నారా..? ఇంతకీ సురేందర్ రెడ్డి పరిస్థితేంటి..? చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా గురించి అప్‌డేట్ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తైన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయిపోయారు. ఆయన తీరు.. అక్కడ ఆయన జోరు చూసాక ఇప్పట్లో ఆయన నుంచి సినిమాలు రావడం కష్టమే అనుకున్నారంతా. కానీ అనుకోకుండా ఓజి 2 అప్‌డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసారు పవన్ టీం. ఓజి 2 ఉంటుందనే విషయాన్ని పవన్ కళ్యాణే స్వయంగా కన్ఫర్మ్ చేశారు. కానీ అదిప్పట్లో ఉంటుందనే ఆశలైతే అభిమానుల్లో లేవు.. పైగా సుజీత్ కూడా నాని సినిమా స్క్రిప్ట్‌తో బిజీగా ఉన్నారు. ఆయన ప్యారడైజ్ నుంచి ఫ్రీ అయ్యాక.. ‘బ్లడీ రోమియో’ను సెట్స్‌పైకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు సుజీత్. ఈ గ్యాప్‌లోనే ఓజి 2 అప్‌డేట్ వచ్చింది. నాని ప్యారడైజ్‌తోనే మరో ఆర్నెళ్లకు పైగా సావాసం చేసేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే బ్లడీ రోమియో స్క్రిప్ట్ పూర్తి చేసిన సుజీత్.. ప్రస్తుతం ఫారెన్‌లో ఉన్నారు. దాంతో ఆయనొచ్చిన వెంటనే ఓజి 2 పనులు మొదలవుతాయని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్వీట్ చేసింది. అంతా బాగానే ఉంది కానీ ఓజి 2తో పాటు సురేందర్ రెడ్డి సినిమాను కూడా పవన్ కదిలిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఓజి ఫ్రాంచైజీపై ముందు నుంచి పవన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఎప్పుడో ఈ సినిమా వస్తుంది. మరి సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ అప్‌డేట్ ఏంటనేది సస్పెన్స్. ఈ సినిమాను పవన్