ఒక కొడుకుగా మీ ముందు నిల్చున్నా.. బసవతారకం రజతోత్సవంలో బాలకృష్ణ భావోద్వేగం
Actor ProfilePolitician

ఒక కొడుకుగా మీ ముందు నిల్చున్నా.. బసవతారకం రజతోత్సవంలో బాలకృష్ణ భావోద్వేగం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఒక కొడుకుగా మీ ముందు నిల్చున్నా.. బసవతారకం రజతోత్సవంలో బాలకృష్ణ భావోద్వేగం
10TV Telugu3 Jul 2026
ఒక కొడుకుగా మీ ముందు నిల్చున్నా.. బసవతారకం రజతోత్సవంలో బాలకృష్ణ భావోద్వేగం

అమ్మ స్ఫూర్తితో ఆసుపత్రి ఆవిర్భావం. నిరుపేదలకు నాణ్యమైన క్యాన్సర్ వైద్యం. అమరావతిలో సేవలు మరింత విస్తరణ. Nandamuri Balakrishna: నిరుపేదలకు నాణ్యమైన క్యాన్సర్ వైద్యం అందించాలనే పవిత్ర ఆశయంతోనే బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభమైందని ఆసుపత్రి ఛైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆ సంస్థ రజతోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఆసుపత్రి ప్రస్తుతం రోజుకు 35 నుంచి 40 శస్త్రచికిత్సలు చేస్తూ వేలాది మంది రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనమైన వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు అనుప్రియ పటేల్, పెమ్మసాని చంద్రశేఖర్, రెండు రాష్ట్రాల మంత్రులు మరియు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. Basavatarakam Hospital: ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు.. హాజరైన సీఎం చంద్రబాబు, వెంకయ్య నాయుడు.. అమరావతిలో కొత్త బ్రాంచ్‌ అమ్మ ఆశయం.. ఆసుపత్రి ఆవిర్భావం: ఈ వేదికపై బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఒక నటుడిగానో, ప్రజాప్రతినిధిగానో కాకుండా, ఒక బాధ్యతగల కొడుకుగా తన హృదయంతరాళాల్లోని మాటలను పంచుకున్నారు. "మా అమ్మ బసవతారకం క్యాన్సర్ బారిన పడినప్పుడు ఆ వేదనను దగ్గరుండి చూశాం. ఆర్థికంగా స్థోమత ఉండటం వల్ల మేము పోరాడగలిగాం, కానీ డబ్బు లేని సామాన్యుల పరిస్థితి ఏమిటని అమ్మ ప్రశ్నించింది" అని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ ఆలోచన నుంచే ఈ ట్రస్ట్ పుట్టిందని, ఇప్పటివరకు లక్షలాది మందికి ఓపీ సేవలు అందించామని తెలిపారు. బాధతో వచ్చే రోగులు ఇక్కడి నుంచి చికిత్స పొంది నవ్వుతూ తిరిగి వెళ్లడమే తమ ఏకైక లక్ష్యమని బాలకృష్ణ స్పష్టం చేశారు. నిలిచిన ప్రమాణం.. భవిష్యత్ ప్రణాళికలు: భారతదేశంలోనే మొట్టమొదటి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కేంద్రాన్ని గతంలోనే ఇక్కడ ప్రారంభించామని, వైద్యరంగంలో ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సుదీర్ఘ 25 ఏళ్ల ప్రయాణంలో తమకు అండగా