ఒకే ఏడాదిలో ఆరు వంద రోజుల పోస్టర్లు... నందమూరి బాలకృష్ణ ఖాతాలో అల్ టైమ్ రికార్డ్
Actor ProfileActor

ఒకే ఏడాదిలో ఆరు వంద రోజుల పోస్టర్లు... నందమూరి బాలకృష్ణ ఖాతాలో అల్ టైమ్ రికార్డ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఒకే ఏడాదిలో ఆరు వంద రోజుల పోస్టర్లు... నందమూరి బాలకృష్ణ ఖాతాలో అల్ టైమ్ రికార్డ్
Samayam Telugu18 Jul 2026
ఒకే ఏడాదిలో ఆరు వంద రోజుల పోస్టర్లు... నందమూరి బాలకృష్ణ ఖాతాలో అల్ టైమ్ రికార్డ్

‘చరిత్ర సృష్టించాలన్నా మేమే... దాన్ని తిరగరాయాలన్నా మేమే’ అని నట సింహం నందమూరి బాలకృష్ణ ఓ సినిమాలో డైలాగ్ చెబుతారు. సినీ ఇండస్ట్రీలో ఆ డైలాగ్ ఆయనకు సరిగ్గా సరిపోతుంది. నవరస నటనా సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన తనదైన డైలాగ్ డెలివరీ, నటనతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నో రికార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఒకే ఏడాదిలో ఒకటి లేదా రెండు విజయాలు అందుకోవడమే గగనమనుకునే రోజుల్లో ఏకంగా ఆరు వరుస హిట్‌ చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఒక్క బాలయ్యకే చెల్లింది. 1986వ సంవత్సరంలో ఆయన సాధించిన ఆ అరుదైన 'డబుల్ హ్యాట్రిక్' ఘనత, 100 రోజుల థియేటర్ పోస్టర్ల ప్రదర్శన ఇప్పటికీ న భూతో న భవిష్యతి. ఆ అద్భుత ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే...ముద్దుల కృష్ణయ్య1986, ఫిబ్రవరి 28న విడుదలైన ఈ చిత్రం తెలుగునాట సరికొత్త చరిత్ర సృష్టించింది. 'మంగమ్మగారి మనవడు' తర్వాత బాలయ్య పల్లెటూరి వేషధారణలో కనిపించడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతకుముందు తన పేరిటే ఉన్న మొదటి వారం వసూళ్ల రికార్డును బద్దలు కొడుతూ, తొలిసారిగా కోటి రూపాయల మార్కును దాటిన చిత్రంగా ఇది ఆల్‌టైమ్ రికార్డ్‌ సృష్టించింది. 28 కేంద్రాలలో 100 రోజులు, 20 కేంద్రాలలో రజతోత్సవం (175 రోజులు), 10 కేంద్రాలలో 200 రోజులు ఆడి రికార్డులు తిరగరాసింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వంటి మూడు ప్రధాన కేంద్రాలలో గోల్డెన్ జూబ్లీ (స్వర్ణోత్సవం) జరుపుకుంది. మహామహులైన ఎన్టీఆర్, ఏయన్నార్ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక హీరో బాలకృష్ణే. దీని వంద రోజుల వేడుకను మద్రాసులోని 'వల్లువార్ కొట్టం'లో నిర్వహించగా, ఒక తెలుగు హీరో సినిమా కోసం తమిళనాడులో ఆ స్థాయిలో అభిమానులు తరలిరావడం ఒక అద్భుతం.* ఏరు దాటాక తెప్ప తగలేసిన తమన్నా.. సౌత్ ఇండస్ట్రీపై ‘మిల్క్ బ్యూటీ’ షాకింగ్