
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్ లో తొలిసారిగా నాకౌట్ దశకు చేరుకుని ఐవరీ కోస్ట్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ చారిత్రాత్మ విజయంతో ఆ జట్టు ఇప్పుడు రౌండాఫ్ 32 గ్రూప్ ఐలో రన్నరప్ లలో ఒకరైన ఫ్రాన్స్ లేదా నార్వేతో తలపడనుంది. గ్రూప్ ఈ లోని మరో మ్యాచ్ లో ఈక్వెడార్ పై జర్మనీ తొలి ప్రయత్నంలోనే గోల్ చేసి కురాసో 3వ స్థానంలో నిలుస్తుందన్న చిన్న ఆశ రేకెత్తించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫిలడెల్ఫియాలో ఐవరీ కోస్ట్ తరపున నికోలస్ పెపే చేసిన తొలి గోల్.. న్యూజెర్సీలోని మెట్ లైఫ్ స్టేడియంలో ఈక్వెడార్ సాధించిన సమం చేసే గోల్.. 82వ ర్యాంకులో ఉన్న కురాకో ఆశలు పూర్తిగా అడియాసలు అయ్యాయి. మైదానంలో ఐవరీ కోస్ట్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపించింది. ఆధిపత్యం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా 2-0తేడాతో సులభంగా విజయాన్ని అందుకుంది. అదే గ్రూపులోని ఒక కీలక మ్యాచులో ఈక్వెడార్ జర్మనీని 2-1తేడాతో ఓడించి గ్రూప్ లో 3వ స్థానాన్ని కైవసం చేసుకుని అందర్నీ షాక్ కు గురిచేసింది. మ్యాచ్ ప్రారంభంలో యాన్ డియోమాండే అద్భుతమైన సమన్వయంతో పెపేకు బంతిని అందించాడు. 7వ నిమిషంలో దాన్ని పెపే నెట్ లోకి హెడ్ చేశాడు. ఆ తర్వాత 64వ నిమిషంలో ఇబ్రహీం సంగారే అందించిన అద్బుతమైన డిఫెన్సివ్ పాస్ తో విల్లారియల్ ఫార్వర్డ్ పెపే తన రెండవ గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. గ్రూప్ ఈ లో రన్నరప్‌గా నిలిచిన ఐవరీ కోస్ట్.. జూన్ 30న డల్లాస్‌లో గ్రూప్ I రన్నరప్‌తో తలపడుతుంది. ఈ