
టీమిండియా టీ20 సారథిగా శ్రేయస్ అయ్యర్ భవితవ్యం ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవం తర్వాత, జులై 1 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ సిరీస్ అతనికి అగ్నిపరీక్షగా నిలవనుంది. ఇందులో కనుక భారత్ విఫలమైతే, అయ్యర్ స్థానంలో ఒక యువ స్టార్ ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పగించేందుకు సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. ఐపీఎల్ హీరో.. అంతర్జాతీయ వేదికపై జీరో అవుతున్నాడా? ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేదికగా శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన కెప్టెన్సీ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును విజేతగా నిలిపిన అయ్యర్, ఆ మరుసటి ఏడాది 2025లో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ వరకు నడిపించాడు. ఈ రెండు సీజన్లలో కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ పరుగుల వరద పారించాడు. అయితే 2026 ఐపీఎల్ సీజన్ ప్రథమార్ధంలో మెరిసినా, ద్వితీయార్ధంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇది కూడా చదవండి: Team India: సిగ్గుండాలి.. సింహానికి హ్యాండిచ్చారు.. కట్‌చేస్తే.. పిల్ల టీంపై దూల తీర్చుకున్నారు.. అయినప్పటికీ, సెలక్టర్లు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. గత ఫిబ్రవరి-మార్చి నెలల్లో భారత్‌కు టీ20 ప్రపంచకప్ అందించి కూడా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్‌ను పక్కన పెట్టి, శ్రేయస్ అయ్యర్‌కు టీ20 సారథ్య బాధ్యతలు అప్పగించారు. కానీ, అయ్యర్ కెప్టెన్సీ ప్రస్థానం అత్యంత నిరాశాజనకంగా ప్రారంభమైంది. ఐర్లాండ్ చేతిలో ఘోర పరాభవం.. విమర్శల పాలైన అయ్యర్.. భారత జట్టు పగ్గాలు చేపట్టిన తొలి పర్యటనలోనే శ్రేయస్ అయ్యర్‌కు ఊహించని షాక్ తగిలింది. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ క్లీన్ స్వీప్ గురైంది. జూన్ 26న జరిగిన తొలి మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా, చరిత్రలోనే మొదటిసారి ఐర్లాండ్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత జూన్ 28న జరిగిన రెండో మ్యాచ్‌లో కేవలం