
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Rishabh Pant Delhi Capitals Return: అందరూ ఊహించిందే జరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన.. భారీ ప్లేయర్ ట్రేడింగ్ చోటుచేసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన వెంటనే లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ పదవికి గుడ్ బై చెప్పిన రిషభ్ పంత్.. తాజాగా జట్టును కూడా వీడాడు. ఎల్‌ఎస్‌జీని వీడి.. తన పాత టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి వెళ్లబోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్ లక్నో టీమ్‌లోకి వెళ్లనున్నాడు. ఈ మేరకు ఢిల్లీ, లక్నో జట్ల మధ్య స్వాప్ డీల్ జరిగింది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రిషభ్ పంత్ 2016 నుంచి 2024 వరకు వరుసగా 9 సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ జట్టు తరఫున అత్యధికంగా 111 మ్యాచ్‌లు ఆడిన రికార్డు పంత్ పేరిటే ఉంది. అంతేకాకుండా.. 2021 నుంచి 2024 వరకు నాలుగు సీజన్లలో 43 మ్యాచ్‌లకు ఢిల్లీ టీమ్‌కు నాయకత్వం వహించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు పంత్ ఢిల్లీ టీమ్‌ను వీడాడు. మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఏకంగా రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వేలం ధర కావడం విశేషం. రెండు సీజన్లపాటు లక్నోకు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్.. అటు కెప్టెన్‌గా.. ఇటు ప్లేయర్‌గా విఫలమయ్యాడు. భారీ ధర దక్కించుకుని.. అందుకు తగ్గ న్యాయం చేయలేదనే విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే ప్రస్తుత ట్రేడింగ్ ఒప్పందం ప్రకారం