ఐటెమ్ సాంగ్ ని ఆస్వాదించని వాళ్లే ఐటెమ్ గాళ్లు’.. అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
Actor ProfileActor

ఐటెమ్ సాంగ్ ని ఆస్వాదించని వాళ్లే ఐటెమ్ గాళ్లు’.. అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

Total News1
Movie Updates0
Sources1
ఐటెమ్ సాంగ్ ని ఆస్వాదించని వాళ్లే ఐటెమ్ గాళ్లు’.. అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
Samayam Telugu14 Jun 2026
ఐటెమ్ సాంగ్ ని ఆస్వాదించని వాళ్లే ఐటెమ్ గాళ్లు’.. అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. మరోవైపు సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణ, ఐటమ్‌ సాంగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు చెబుతో.. అభ్యంతరాలు వ్యక్తమైన జాన్వీ సీన్స్ డిలీట్ చేశారు. ఇక 'హెల్లల్లో' పాట రాసిన గీత రచయిత అనంత్ శ్రీరామ్ పై నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. దేనిపై ఆయన తాజాగా స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు.'పెద్ది' రిలీజైన తర్వాత కూడా సినిమాని ఇంకా జనాల్లోకి తీసుకెళ్లడానికి పెద్దగా ప్రమోట్ చేస్తున్న మేకర్స్.. ఆదివారం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి డైరెక్టర్ బుచ్చిబాబు, నిర్మాత వెంకట సతీష్, లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘పెద్ది’లోని ఐటమ్‌ సాంగ్‌పై వస్తున్న విమర్శల గురించి జర్నలిస్టులు ప్రస్తావించారు. దీనికి అనంత్‌ శ్రీరామ్‌ సమాధానమిస్తూ.. ఐటెమ్ సాంగ్‌ను ఐటెమ్ సాంగ్‌లాగే ఆస్వాదించాలన్నారు. సాహిత్య విలువలు తెలిసినవాళ్లు, అర్థం చేసుకునే వాళ్లతో సమస్య లేదని.. వాళ్ళు ఏది అడిగినా సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈ క్రమంలో విమర్శకులపై ఆయన పరుష పదజాలం వాడటం వివాదానికి దారితీసింది. ''ఐటెమ్ పాటని ఐటెమ్ సాంగ్‌లాగా ఆస్వాదించినోళ్లకి ఒక స్పెషల్ ఐటెం రుచి చూపించినట్టు. ఐటెమ్ సాంగ్‌ని ఐటెమ్ సాంగ్‌లాగా ఆస్వాదించని వాళ్లే ఐటెం గాళ్ల కింద లెక్క. ఆరోపణ అనేది నిర్దిష్టంగా ఉండాలి. మనకి వచ్చిన భావోద్వేగాన్ని ఏదో అరిసేయడానికో.. లేకపోతే ప్రత్యేకంగా ఎజెండా పెట్టుకుని మాట్లాడితే దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తాత్వికంగా ఆలోచించగలిగే వాళ్లు, తార్కికంగా మాట్లాడగలిగే వాళ్లు ఎవరైనా ఏ వాక్యం మీద ఏ ఆరోపణ నిర్దిష్టంగా చేసినా.. నిఖార్సైన సమాధానం ఇవ్వడానికి నిజాయితీగా సిద్ధంగా ఉన్నాను'' అని అనంత్ శ్రీరామ్ అన్నారు. ''రచయితకు అవధులు ఉండకూడదు. ఏ గీతానికి ఏ అవధులు ఉండవు. ఆలోచనా శక్తి, ఊహాశక్తే