ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్ర యాణికుల ఫైర్
Actor ProfileActor

ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్ర యాణికుల ఫైర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్ర యాణికుల ఫైర్
Sakshi14 Aug 2026
ఏసీ రైళ్లు మాకొద్దు.. ప్ర యాణికుల ఫైర్

ముంబై: దేశ వాణిజ్య రాజ‌ధాని ముంబై మ‌హా న‌గ‌రంలోని సెంట్రల్‌ రైల్వే మార్గంలో సోమవారం నుంచి కొత్తగా మరో 12 ఏసీ లోకల్‌ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఏసీ రైళ్ల సంఖ్య‌ పెరగడంతో ముంబైకర్ల ప్రయాణం మరింత కూల్‌గా మారనుంది. ఏసీ రైళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వీటి సంఖ్య పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏసీ రైళ్లను ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్‌ (సీఎస్‌ఎంటీ)– కల్యాణ్‌ స్టేషన్ల మధ్య నడపనున్నట్లు సెంట్రల్‌ రైల్వే పేర్కొంది. దీంతో సెంట్రల్‌ రైల్వే మార్గంలో స్లో, ఫాస్ట్‌ మార్గంలో తిరుగుతున్న మొత్తం ఏసీ లోకల్‌ రైళ్ల ట్రిప్పుల సంఖ్య 120కి చేరింది. ఇందులో మెయిన్‌ లేన్‌లో 92 ట్రిప్పులు, హార్బర్‌ మార్గంలో 28 ట్రిప్పులున్నాయి. అలాగే కొంత కాలంగా కార్‌ షెడ్డులో నిలిపి ఉంచిన మరో ఏసీ లోకల్‌ రైలును నడపాలని అధికారులు భావిస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో ఏసీ రైళ్ల ట్రిప్పుల సంఖ్య మరింత పెరగనుంది. ప్రయాణికుల వ్య‌తిరేక‌త‌ ఏసీ లోకల్‌ రైళ్లపై సాధారణ ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కొత్తగా 12 ఏసీ లోకల్‌ రైళ్లను పెంచడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏసీ రైళ్ల కారణంగా నాన్‌ ఏసీ రైళ్ల సంఖ్య తగ్గిందని, ఫలితంగా వాటిల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్‌ రైల్వే మార్గంలో ప్రతీరోజు మొత్తం 1,820 లోకల్‌ రైళ్లు తిరగ్గా అందులో ఏసీ రైళ్ల ట్రిప్పుల సంఖ్య 120 ఉంది. అయితే సోమవారం నుంచి కొత్తగా నడుపుతున్న ఈ ఏసీ రైళ్లను శని, ఆదివారాలతోపాటు ప్రభుత్వ సెలవు రోజుల్లో నడపబోమని అధికారులు స్పష్టం చేశారు. విపరీతంగా లోకల్‌ రైళ్ల రద్దీ ఇప్పటికే సాధారణ లోకల్‌ రైళ్ల సంఖ్య తగ్గిపోవడంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయిందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రారంభంలో ఏసీ లోకల్‌ రైళ్లకు ముంబైకర్ల నుంచి అనుకున్నంత మేర స్పందన రాలేదు. ఉదయం