
విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. K Bhagyaraj Net Worth 2026:తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు, నటుడు కే భాగ్యరాజ్ మరణం అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఎన్నో విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఆయన, దాదాపు ఐదు దశాబ్దాల పాటు సినీ రంగానికి సేవలు అందించారు. ఆయన మరణంతో ఒక గొప్ప సినీ అధ్యాయం ముగిసిందని పలువురు సినీ ప్రముఖులు భావిస్తున్నారు. కే భాగ్యరాజ్ తన సినీ జీవితాన్ని సహాయ దర్శకుడిగా ప్రారంభించారు. ఆ తర్వాత దర్శకుడిగా, రచయితగా, నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే రచనలో ఆయనకు ఉన్న ప్రత్యేక శైలి కారణంగా సినీ అభిమానులు, విమర్శకులు ఆయనను "స్క్రీన్‌ప్లే మాంత్రికుడు"గా అభివర్ణించేవారు. ఆయన రూపొందించిన సినిమాల్లో మధ్యతరగతి కుటుంబాలు, భార్యాభర్తల బంధం, కుటుంబ విలువలు, హాస్యంతో కూడిన భావోద్వేగ కథలు ఎక్కువగా కనిపించేవి. పెద్ద పెద్ద విలన్ల కన్నా పాత్రల మధ్య వచ్చే అపార్థాలు, పరిస్థితులనే కథలో ప్రధాన సంఘర్షణగా చూపించడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దర్శకుడిగానే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, నటన వంటి అనేక విభాగాల్లో కూడా భాగ్యరాజ్ తన ప్రతిభను చూపించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా ఆయన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఆయన కథలను ఆధారంగా చేసుకుని అనేక చిత్రాలు రీమేక్ అయ్యాయి. సుమారు 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఆయన అనేక