ఏళ్ల వేడుక స్పెషల్
Actor ProfilePolitician

ఏళ్ల వేడుక స్పెషల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏళ్ల వేడుక స్పెషల్, అమెరికా కొత్త పాస్ పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్
Oneindia Telugu6 Aug 2026
ఏళ్ల వేడుక స్పెషల్, అమెరికా కొత్త పాస్ పోర్ట్ లిమిటెడ్ ఎడిషన్

అమెరికా తమ 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవాన్ని జరుపుకోబోతున్న నేపథ్యంలో, ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఇంట్రెస్టింగ్ నిర్ణయాన్ని వెల్లడించారు. అమెరికా 250వ వార్షికోత్సవం సందర్భంగా విడుదల చేయనున్న లిమిటెడ్ ఎడిషన్ పాస్‌పోర్టులో తన సొంత చిత్రాన్ని ముద్రించనున్నట్లు ఆయన ప్రకటించారు. తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఈ కొత్త పాస్‌పోర్టు డిజైన్ను పంచుకుంటూ, దానిపై వెల్‌కమ్, బట్ బీ గుడ్! (స్వాగతం, కానీ మర్యాదగా ఉండండి!) అనే నినాదాన్ని కూడా ట్రంప్ జోడించారు.పాస్‌పోర్టు డిజైన్‌లో విశేషాలు..ప్రభుత్వం విడుదల చేసిన ఈ కొత్త పాస్‌పోర్టు నమూనాలో అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. పాస్‌పోర్టు లోపలి పేజీలో వైట్ హౌస్‌లోని ప్రసిద్ధ రిజల్యూట్ డెస్క్పై అధ్యక్షుడి చిత్రం ప్రముఖంగా కనిపిస్తుంది. దాని వెనుక చారిత్రక అమెరికన్ స్వాతంత్ర్య ప్రకటన (Declaration of Independence) పాఠ్యం ఉండగా, కింది భాగంలో ట్రంప్ సంతకం కూడా ఉంది. ఎదురుగా ఉన్న పేజీలో జాన్ ట్రంబుల్ గీసిన ప్రసిద్ధ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ చిత్రం ఉంది. ఈ పాస్‌పోర్టులో ఉపయోగించిన ట్రంప్ చిత్రం వాషింగ్టన్‌లోని నేషనల్ పోర్ట్రెయిట్ గ్యాలరీలో ఉన్న ఆయన చిత్రపటం స్ఫూర్తితో రూపొందించినట్లు తెలుస్తోంది. US Visa రూల్స్ మార్చేసిన వైట్‌హౌస్! ఇక 4 ఏళ్లే ఛాన్స్..అందుబాటులోకి ఎప్పుడు?ఈ ప్రత్యేక ఎడిషన్ పాస్‌పోర్టును గత ఏప్రిల్‌లో అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రకటించారు. దీనిపై వైట్ హౌస్ కూడా స్పందిస్తూ, అమెరికా 250 ఏళ్ల వేడుకలను పురస్కరించుకుని ఈ కొత్త పాస్‌పోర్టును తీసుకొచ్చాం అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ధృవీకరించింది. అయితే, ఈ ప్రత్యేక పాస్‌పోర్టులు అందరికీ అందుబాటులో ఉండవు. కేవలం వాషింగ్టన్ పాస్‌పోర్ట్ ఏజెన్సీలో నేరుగా వెళ్లి పాస్‌పోర్టు రెన్యువల్ చేయించుకునే వారికి మాత్రమే ఇది లభిస్తుందని అధికారులు వెల్లడించారు. ఆన్‌లైన్ సేవలు లేదా ఇతర ప్రాంతాల్లో యథావిధిగా పాత డిజైన్‌తో కూడిన పాస్‌పోర్టులే కొనసాగుతాయని స్పష్టం చేశారు. UAE Visa: మారిన దుబాయ్