
‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా’ ఆ మాటల్ని అందరమూ మనస్ఫూర్తిగా నమ్ముతాం. త్రికరణ శుద్ధిగా ఆచరిస్తాం. కానీఆ నమ్మకాన్ని వమ్ముచేసిన ఒక కేటుగాడు, తన స్నేహితుడి నట్టే ముంచాడు. నమ్మకమున్న చోటే నమ్మకద్రోహం ఉంటుందని నిరూపించిన వైనమిది. ఏళ్ల తరబడి ఉన్న నమ్మకమే మోసపోవడానికి ప్రధాన కారణం అవుతుంది. మనోడే కదా అని నమ్మిదే, ప్రశ్నించడం మానేస్తే, వారు చెప్పే అబద్ధాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతే మునిగిపోక తప్పదు.చైనాలో సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.దాదాపు ముప్పై ఏళ్ల నాటి పరిచయాన్ని ఆసరాగా చేసుకుని, ఒక ఖాళీ అపార్ట్‌మెంట్‌కు తాళం మార్చేసి, తనకు సంబంధం లేని ఆస్తిని స్నేహితులకు అమ్మేశాడు..చివరికి ఏం జరిగింది? తెలుసుకుందాం పదండి. సౌత్ చైనా మోర్నింగ్ పోస్ట్ మరియు సిన్మిన్ ఈవెనింగ్ న్యూస్ కథనాల ప్రకారం.. షాంఘైకి చెందిన ‘సన్’ అనే వ్యక్తి, తనకు దాదాపు 30 ఏళ్ల స్నేహానికి వెన్నుపోటు పొడిచాడు. కష్టకాలంలో తనకు అండగా ఉన్నారన్న కృతజ్ఞత లేకుండా, స్నేహితుడిని, అతని భార్యను మోసం చేసి, వారి ఆస్తికి యజమానిగా నటించి వారి వద్ద నుండి సుమారు రూ. 97 లక్షలు కాజేశాడు. అసలేం జరిగింది? సన్ గతంలో రెండు రిటైల్ షాపులు నడిపేవాడు. కానీ అవి మూతపడ్డాయి. గతంలో కూడా అతను ఒక మోసం కేసులో జైలు శిక్ష అనుభవించి 2017లో విడుదలైయ్యాడు. జైలు నుండి వచ్చాక, అతను ముప్పై ఏళ్లుగా తనకు పరిచయం ఉన్న వలస కూలీలైన దంపతులను ఆశ్రయించాడు. ఆ దంపతుల ఆర్థిక పరిస్థితి అంతగా బాగాలేకపోయినా, సన్‌కు కడుపునిండా భోజనం పెట్టి, అడిగినప్పుడల్లా డబ్బు ఇస్తూ మానసికంగా ఎంతో అండగా నిలిచారు. కాలక్రమేణా, సన్ వారి ముందు ఒక పెద్ద ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు. తనకు షాంఘైలో ఆస్తులు ఉన్నాయని, విలేజ్ కమిటీకి చెందిన బంధువులతో బలమైన పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు. దాంతో ఆ దంపతులు తమకు ఒక తక్కువ ధరలో ఇల్లు