ఏళ్ల తాబేలును కలవబోతున్న ప్రధాని మోదీ! ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవి
Actor ProfileCelebrity

ఏళ్ల తాబేలును కలవబోతున్న ప్రధాని మోదీ! ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏళ్ల తాబేలును కలవబోతున్న ప్రధాని మోదీ! ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవి
Oneindia Telugu31 Jul 2026
ఏళ్ల తాబేలును కలవబోతున్న ప్రధాని మోదీ! ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవి

ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన జీవించి ఉన్న భూచర ప్రాణిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన ఏకంగా 194 ఏళ్ల జోనాథన్ అనే తాబేలును భారత ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకోనున్నారు. సేషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవాలలో పాల్గొనేందుకు శనివారం (జూన్ 27, 2026) ఆ దేశానికి చేరుకున్న ప్రధాని మోదీ, తన పర్యటనలో భాగంగా పర్యావరణ పరిరక్షణ పట్ల తనకున్న నిబద్ధతను చాటేలా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. సేషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్స్‌లో నివాసముంటున్న ఈ ఆల్డాబ్రా జెయింట్ తాబేలు, ప్రపంచ చరిత్రకే ఒక సజీవ సాక్ష్యం.జోనాథన్ విశేషాలు..194 ఏళ్ల సుదీర్ఘ వయసు కలిగిన జోనాథన్ జీవన ప్రస్థానం ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. ఇది 1832 నాటి ప్రపంచాన్ని చూసింది. ఆధునిక ప్రపంచపు మార్పులు, సాంకేతిక విప్లవాలు, ఎన్నో రాజకీయ పరిణామాలు జరుగుతున్నా.. ఈ తాబేలు మాత్రం సేషెల్స్ భూమిపై నిశ్చలంగా తన జీవనాన్ని కొనసాగిస్తూ వస్తోంది. అత్యంత నెమ్మదైన ప్రాణి అయినప్పటికీ, కాలంతో పాటు ప్రయాణిస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇటువంటి అరుదైన జీవిని కలవడం, పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణపై భారత్‌కు ఉన్న అంకితభావానికి ప్రతీకగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బొటానికల్ గార్డెన్‌లోనే ప్రధాని మోదీ ఒక మొక్కను నాటి, పర్యావరణ హితమైన సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పనున్నారు. మరోసారి విశ్వబంధుగా భారత్.. ఆపరేషన్ అమిస్టాడ్‌’తో రంగంలోకి మోదీవ్యూహాత్మక భాగస్వామ్యానికి సరికొత్త మైలురాయి..కేవలం పర్యాటక అంశాలే కాకుండా, ఈ పర్యటన భారత్-సేషెల్స్ దౌత్య సంబంధాలలో అత్యంత కీలకం కానుంది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రధాని మోదీ అక్కడ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. భారత్ తన విజన్ సాగర్ (MAHASAGAR) పరిధిలో సేషెల్స్‌ను అత్యంత విలువైన సముద్ర తీర పొరుగుదేశంగా భావిస్తోంది. పర్యటనలో భాగంగా సేషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినీతో మోదీ భేటీ