ఏళ్ల టీచరమ్మ ఫిట్ నెస్ కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం
Actor ProfilePolitician

ఏళ్ల టీచరమ్మ ఫిట్ నెస్ కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం

Total News1
Movie Updates0
Sources1
ఏళ్ల టీచరమ్మ ఫిట్ నెస్ కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం
Sakshi14 Jun 2026
ఏళ్ల టీచరమ్మ ఫిట్ నెస్ కి ఫిదా అవ్వాల్సిందే..! శాస్త్రవేత్తలు సైతం

తొమ్మిది పదుల వయసులో వృద్ధాప్యాన్ని దిక్కరించేలా చురుగ్గా ఉందామె. సింపుల్‌గా చెప్పాలంటే 30 ఏళ్ల వ్యక్తిలా ఉంది. ఆమె కండరాల శక్తి, యాక్టివిటీని చూసి శాస్త్రవేత్తలే విస్తుపోయారు. అంతేగాదు డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలకు మించి తీవ్రమైన వ్యాయామాలు చేస్తంటుంది. పైగా 60 దాటినవారు చేయకూడని వ్యాయమాలే అయినా..ఈ బామ్మ మాత్రం చాలా సునాయాసంగా చేసేస్తుంది. అంతేగాదు ఆమెను చూడగానే తొమ్మిది పదుల వయసు ఉన్న వ్యక్తిలా కనిపించదు..జస్ట్‌ 30 ఏళ్లే అన్నట్లుగా ఉంటుంది ఆమె ఆహార్యం. ఇంతలా యంగ్‌లుక్‌లో ఆశ్చర్యపరుస్తున్న ఆ బామ్మ దీర్ఘాయువు రహస్యం గురించి సవివరంగా తెలుసుకుందామా.!. ఆ బామ్మ పేరే ఎమ్మా మరియా మజెంగా. ఇటలీలో పాడువాలో నివశిస్తున్న రిటైర్డ్‌ సైన్స్‌ టీచరమ్మ. ఆమె ఎన్నో ప్రపంచిరికార్డులు కలిగి ఉన్న అగ్రశ్రేణి స్ప్రింటర్‌. పరుగు పందెంలో ఆమెకు సాటిలేరెవ్వెరూ అన్నట్లుగా ఎన్నో పతకాలు సొంతం చేసుకుందామె. వయసు పరంగా 90 ఏళ్లు పైబడిన వ్యక్తిలా ఉండదు..30 ఏళ్ల మాదిరిగా కనిపిస్తోంది. వృద్ధాప్యాన్నే ధిక్కరించేలా హెల్దీగా ఉండే తీరు శాస్త్రవేత్తలను సైతం అబ్బురపర్చింది. వాళ్లు సైతం ఆమె ఆరోగ్యంపై స్టడీ చేయగా..ఆమె శరీరంలోని కండరాలు..30 ఏళ్ల వ్యక్తుల మాదిరిగా శక్తిమంతంగా ఉన్నాయని చెప్పారు. తొంభై ఏళ్ల వయసులో కూడా ఈ రన్నింగ్‌ పోటీల్లో ఎలా పాల్గొనగలుగుతోందే అనే కుతూహలంతో ఆమె శరీరం తీరుపై పరిశోధన చేయగా..30 ఏళ్ల క్రీడాకారుల ఫిట్‌నెస్‌ని పోలి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. అంతేగాదు ఆక్సిజన్‌ను శక్తిగా మార్చే మైటోకాండ్రియా, ఆమె కండరాలలోని 20 ఏళ్ల యువకుడిలో ఉన్నంత దృఢత్వంతో పనిచేస్తోందట. ఎమ్మా కథ వ్యాయామ దినచర్య వృద్ధాప్యాన్ని తిరగరాయగలదని చెబుతోంది. అయితే గంటల తరబడి మారథాన్‌ చేయదామె..కేవలం నిలకడతో తేలికపాటి వ్యాయామాలోతోనే ఈ ఫిట్‌నెస్‌ని సాధించిందామె. ఎమ్మా చేసే వ్యాయామం గంటలోపే పూర్తవ్వుతుందట. వార్మప్‌, తేలికపాటి జాగింగ్‌, లక్షిత స్ప్రింట్‌ల శ్రేణి, వాకింగ్‌, చిన్నపాటి తీవ్రత వ్యాయామాలు ఉంటాయంతే. అలాగే డైట్‌ పరంగా గుడ్లు, చేపలు, కూరగాయలపై దృష్టి