
దక్షిణ భారత దేశానికి అన్నపూర్ణగా, మూడు రాష్ట్రాల ఆయువుపట్టుగా నిలిచిన ప్రఖ్యాత తుంగభద్ర డ్యామ్ 73 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో నేడు ఒక అత్యంత అరుదైన, సువర్ణ ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రాజెక్టుకు ప్రతిష్టాత్మకంగా అమర్చిన 33 సరికొత్త క్రెస్ట్ గేట్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకె. శివకుమార్, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో కలిసి నేడు (జూన్ 25న) ఉమ్మడిగా ప్రారంభించనున్నారు. ఒకే వేదికపై ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతుండటంతో హోస్పేట అంతటా పండుగ వాతావరణం నెలకొంది.రెండు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలకు జీవనాడి అయిన తుంగభద్ర ప్రాజెక్టుకు 2024 ఆగస్టులో ఒక పెద్ద విపత్తు ఎదురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వచ్చిన భారీ వరద ఉధృతికి డ్యామ్ లోని 19వ నంబర్ క్రెస్ట్ గేటు పూర్తిగా కొట్టుకుపోయింది. అప్పట్లో నీటి వృధాను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని, ప్రముఖ సీనియర్ ఇంజనీర్ కన్నయ్య నాయుడు నేతృత్వంలో రికార్డు సమయంలో తాత్కాలిక స్టాప్‌లాక్ గేటును అమర్చి ప్రమాదాన్ని తప్పించారు. ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక ప్రకారం.. భవిష్యత్తు భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్యామ్ లోని మొత్తం 33 స్పిల్ వే గేట్లను మార్చాలని నిర్ణయించారు. దీనికోసం కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలు ఉమ్మడిగా రూ.51 కోట్ల నిధులు కేటాయించి, కేవలం ఆరు నెలల రికార్డు కాలంలోనే అత్యాధునిక సాంకేతికతతో కూడిన 33 కొత్త గేట్ల నిర్మాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాయి. తుంగభద్ర డ్యామ్ పునర్జన్మ.. రాయలసీమ తలరాత మారుతుందా?ఆంధ్రప్రదేశ్‌కు వరప్రదాయిని..తుంగభద్ర డ్యామ్ భద్రత ఏపీకి అత్యంత కీలకం. ఈ ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాలైన కర్నూలు, కడప, అనంతపురం పరిధిలో దాదాపు 1.46 hct (హెక్టార్లు - సుమారు 3.6 లక్షల ఎకరాలు)