ఏళ్ల చిరంజీవి ఫిట్ నెస్ సీక్రెట్ వెల్లడించిన రామ్ చరణ్
Actor ProfileCelebrity

ఏళ్ల చిరంజీవి ఫిట్ నెస్ సీక్రెట్ వెల్లడించిన రామ్ చరణ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏళ్ల చిరంజీవి ఫిట్ నెస్ సీక్రెట్ వెల్లడించిన రామ్ చరణ్, చరణ్ జీవి ఏమన్నాడంటే
Asianet News Telugu13 Jul 2026
ఏళ్ల చిరంజీవి ఫిట్ నెస్ సీక్రెట్ వెల్లడించిన రామ్ చరణ్, చరణ్ జీవి ఏమన్నాడంటే

రీసెంట్ గా పెద్ది సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ఆమధ్యే రిపబ్లిక్ సమ్మిట్ 2026లో తన సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం, తండ్రి మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధం, అలాగే చిన్ననాటి అనుభవాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన తండ్రి చిరంజీవి క్రమశిక్షణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో ఉన్న చిరంజీవి ఇప్పటికీ అంత ఫిట్ గా ఉండటానికి కారణం ఏంటో కూడా చరణ్ వెల్లడించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, "మా నాన్నగారికి ఇప్పుడు 70 ఏళ్లు. ఆయన ఉదయం 5:30 గంటలకు నిద్రలేస్తారు. కాఫీ తాగి, ఉదయం 6 గంటలకల్లా జిమ్‌లో ఉంటారు. నన్ను కూడా జిమ్‌కు రమ్మని తరచూ పిలుస్తుంటారు. ఆయన తన వర్కౌట్‌ను, తన ఆరోగ్యాన్ని, తనను తాను అందంగా చూసుకోవడాన్ని ఎంతో ఇష్టపడతారు" అని చెప్పారు. చరణ్ మాట్లాడుతూ.. "నేను ఒక సారి నాన్నను అడిగాను మీరు ఇంకా ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అని. దానికి ఆయన ఇచ్చిన సమాధానం విని షాక్ అయ్యాను. "రామ్, నేను కేవలం సినిమాల కోసం ఇది చేయడం లేదు. నా మెదడు చురుకుగా ఉండటానికి, మీ అందరి కోసం, నా మనవళ్లు, మనవరాళ్ల కోసం ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నా ను" అని చిరంజీవి చెప్పినట్లు రామ్ చరణ్ తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని కూడా చరణ్ వెల్లడించారు. చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ రామ్ చరణ్ మరికొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "మా ఇంటికి వచ్చే దర్శకులు, నిర్మాతలు 'ఒకరోజు నువ్వు కూడా మీ నాన్నగారి అడుగుజాడల్లో నడవాలి' అని చెప్పేవారు. అలా చిన్న వయసులోనే నా భుజాలపై పెద్ద బాధ్యతను ఉంచేవారు. అయితే నేను వాటిని పెద్దగా పట్టించుకోలేదు"