
బలూచ్ నేషనల్ మూవ్‌మెంట్ (BNM) సీనియర్ నాయకుడు డాక్టర్ దీన్ మహమ్మద్ బలూచ్ అదృశ్యమై నేటికి (జూన్ 28 నాటికి) సరిగ్గా 17 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ కాలంలో ఆయన ఎక్కడున్నారు? ఏమయ్యారు? అనే కనీస సమాచారం కూడా లేకపోవడం, బలూచిస్థాన్‌లో వేలాది మంది ఎదుర్కొంటున్న అదృశ్యాల విషాదకర స్థితికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోందని ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ నసీమ్ బలూచ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మనిషి కనిపించకుండా పోయి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా, ఇప్పటికీ ఆయన కోసం ఒక కుటుంబం ఎదురుచూడటం వర్ణనాతీతమైన మానసిక క్షోభని ఆయన పేర్కొన్నారు.కుమార్తె వీరోచిత పోరాటం.. బెదిరింపుల పర్వండాక్టర్ దీన్ మహమ్మద్ బలూచ్ అదృశ్యమైనప్పటి నుంచి ఆయన కుమార్తె సమ్మి దీన్ బలూచ్ తన తండ్రితో పాటు బలవంతంగా మాయమైపోయిన వేలాది మంది బలూచ్ ప్రజల రికవరీ కోసం శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, ఒక కుమార్తెగా తనకు న్యాయం చేయాలని కోరుతున్న ఆమెకు పాకిస్థాన్ పాలకులు, అధికారుల నుంచి ఆదరణకు బదులు తీవ్రమైన బెదిరింపులు, వేధింపులు ఎదురవుతున్నాయని బీఎన్ఎమ్ ఆరోపించింది. తన తండ్రి కోసం చేస్తున్న మానవ హక్కుల పోరాటాన్ని, ప్రచారాన్ని ఎలాగైనా అణచివేయాలనే ఉద్దేశంతోనే ఆమెను నిరంతరం భయభ్రాంతులకు గురిచేస్తున్నారని డాక్టర్ నసీమ్ బలూచ్ మండిపడ్డారు.అఫ్గానిస్తాన్ లో భారీ భూకంపం.. దద్దరిల్లిన దిల్లీ, కాశ్మీర్..పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం, హక్కులు శూన్యం!ఈ అదృశ్యాల వ్యవహారం బలూచిస్థాన్‌లో జరుగుతున్న విస్తృతమైన మానవ హక్కుల ఉల్లంఘనలను ప్రపంచానికి చాటిచెబుతోందని బలూచ్ నాయకత్వం విమర్శించింది. తమ అదృశ్యమైన కుటుంబ సభ్యుల గురించి కనీస సమాచారం అడగడాన్ని కూడా అక్కడ ఒక నేరంగా పరిగణిస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్ర అణచివేతను ప్రశ్నించే వారికి, మానవ హక్కుల కోసం గొంతుకెత్తే వారికి పాకిస్థాన్‌లో రక్షణ, న్యాయం, ప్రజాస్వామ్యం అనేవి పూర్తిగా కరువయ్యాయని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పాక్ బలగాల