ఏళ్లు ఆ నరకం పవన్ ఎలా అనుభవించారో
Actor ProfilePolitician

ఏళ్లు ఆ నరకం పవన్ ఎలా అనుభవించారో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏళ్లు ఆ నరకం పవన్ ఎలా అనుభవించారో
Eenadu19 Aug 2026
ఏళ్లు ఆ నరకం పవన్ ఎలా అనుభవించారో

ఇంటర్నెట్‌ డెస్క్: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ భుజాలకు వెంటనే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రి వైద్యులు సూచించారు. రొటేటర్‌ కఫ్‌తో పాటు భుజానికి సంబంధించిన రెండు కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) స్పందించారు. పవన్‌ అంత బాధను పదిహేనేళ్లుగా ఎలా భరించారోనని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘15 ఏళ్లుగా మీరు (Pawan Kalyan) నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. నాకు ఈ రోజు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్లముందే కనిపిస్తున్నాయి. గుజరాత్‌లో జరిగిన ఆ ప్రమాదం, గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం, వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం.. ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు.. మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం’’ ‘‘ముందు సినిమా పూర్తి చేద్దాం. నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు. ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు’ అని ఆపరేషన్‌ను వాయిదా వేసి, షూటింగ్ పూర్తి చేసి, సినిమా విడుదలయ్యే వరకూ మాకు అండగా నిలిచారు. ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు.. జీవితాంతం మర్చిపోలేని రుణం. ఆ రుణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చలేను. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది’’ ‘‘దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను.. మీరు అనుభవించిన నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు.. నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన నిజమైన హీరో’’ అని బండ్ల