ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక
Actor ProfilePolitician

ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక
Andhra Jyothy12 Aug 2026
ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక

ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతాంగాణ సంస్కృతికి ప్రతీక అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేట జిల్లా, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతుల సంస్కృతికి ప్రతీక అని మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. రైతులందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు (సోమవారం) హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని కూరెళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని రైతులతో కలిసి మంత్రి పొన్నం దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో ఆయు ఆరోగ్యాలతో రైతులు ఉండాలని మంత్రి పొన్నం ఆకాంక్షించారు. అన్నదాతలు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. అందుకే తమ ప్రభుత్వం రైతన్నల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలను మాత్రమే అన్నదాతలు వినియోగించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు సాధించే దిశగా రైతన్నలు ముందుకు సాగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో పీవీ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి: మంత్రి దామోదర