ఉత్తరాది నుంచి వచ్చే కథానాయికలకు దక్షిణాది చిత్రసీమ ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తూనే ఉంటుంది. ఇక్కడి ప్రేక్షకులు ఇచ్చే ఆదరణ, గౌరవం మరెక్కడా దక్కవనేది జగమెరిగిన సత్యం. అవకాశాలు ఉన్నంత కాలం టాలీవుడ్‌ను, కోలీవుడ్‌ను దేవాలయాలుగా కీర్తించే ముద్దుగుమ్మలు, ఒక్కసారి ఇక్కడ మార్కెట్ తగ్గగానే బాలీవుడ్ వైపు చూస్తూ సౌత్ ఇండస్ట్రీపై విమర్శల రాళ్లు రువ్వడం చిత్రసీమలో ఒక అలవాటుగా మారిపోయింది. గతంలో రాధికా ఆప్టే, తాప్సి లాంటి ఇలాగే ఛాన్సులు తగ్గగానే సౌత్ ఇండస్ట్రీపై రాళ్లు వేయగా.. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా చేరిపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.గ్లామర్ బొమ్మలుగానే చూస్తారా?తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా చేసిన వ్యాఖ్యలు దక్షిణాది సినీ జనాన్ని, ప్రేక్షకులను తీవ్రంగా గాయపరిచాయి. హిందీ పరిశ్రమలో నటీనటులకు నటనతో పాటు గ్లామర్‌ను బ్యాలెన్స్ చేసే స్వేచ్ఛ ఉంటుందని చెబుతూ.. సౌత్ ఇండస్ట్రీపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "దక్షిణాది చిత్ర పరిశ్రమలో పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుంది. అక్కడ హీరోయిన్లను చూసే విధానం, వారి పాత్రలను ప్రశంసించే తీరు అంత గొప్పగా ఏమీ అనిపించదు" అంటూ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించారు.* బాబాయ్‌కి అబ్బాయ్ సర్ప్రైజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్-చరణ్ ఫోటోలు ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, తెలుగు సినీ అభిమానులు మండిపడుతున్నారు. "ఇంతకాలం ఇక్కడ స్టార్ స్టేటస్ అనుభవించి, ఇప్పుడు అవకాశాలు తగ్గగానే ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతారా?" అంటూ తమన్నాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘బాహుబలి’లో అవంతికగా, ‘సైరా నరసింహారెడ్డి’లో లక్ష్మిగా ఆమెకు దక్కిన నటన ప్రాధాన్యమున్న పాత్రలు ఆమెకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. ‘ఓదెల-2’ ప్రమోషన్ల సమయంలో టాలీవుడ్‌ను ఆకాశానికెత్తిన మిల్క్ బ్యూటీ.. ఇప్పుడు ఇలా మాట మార్చడం ఏరు దాటాక తెప్ప తగలేయడమేనని మండిపడుతున్నారు. పరాజయాల ప్రభావమేనా?గత కొంతకాలంగా తమన్నాకు దక్షిణాదిలో ఆశించిన విజయాలు దక్కడం లేదు
Actor ProfileActor
ఏరు దాటాక తెప్ప తగలేసిన తమన్నా.. సౌత్ ఇండస్ట్రీ
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•18 Jul 2026
ఏరు దాటాక తెప్ప తగలేసిన తమన్నా.. సౌత్ ఇండస్ట్రీపై మిల్క్ బ్యూటీ’ షాకింగ్ కామెంట్స్