ఏబీఎన్ ఎఫెక్ట్.. రొయ్యల ఫీడ్ ధరల పర్యవేక్షణకు శాశ్వత కమిటీ ఏర్పాటు
Actor ProfilePolitician

ఏబీఎన్ ఎఫెక్ట్.. రొయ్యల ఫీడ్ ధరల పర్యవేక్షణకు శాశ్వత కమిటీ ఏర్పాటు

Total News1
Movie Updates0
Sources1
ఏబీఎన్ ఎఫెక్ట్.. రొయ్యల ఫీడ్ ధరల పర్యవేక్షణకు శాశ్వత కమిటీ ఏర్పాటు
Andhra Jyothy15 Jun 2026
ఏబీఎన్ ఎఫెక్ట్.. రొయ్యల ఫీడ్ ధరల పర్యవేక్షణకు శాశ్వత కమిటీ ఏర్పాటు

ఆక్వా రైతుల సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రసారం మయ్యాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ క్రమంలో ఆక్వా రంగ రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతుల సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రసారం మయ్యాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఈ క్రమంలో ఆక్వా రంగ రైతుల ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రొయ్యల ఫీడ్ ధరల నియంత్రణ, పారదర్శకత కోసం శాశ్వత రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు యానిమల్ హస్బండ్రీ అండ్ ఫిషరీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ జీఓ ఆర్టీ నంబర్ 180 జారీ చేశారు. ఈ నిర్ణయంపై రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఓ ప్రకటన విడుదల చేశారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఉత్పత్తి వ్యయాల తగ్గింపే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఏపీ శ్రింప్ ఫీడ్ ఇన్‌గ్రిడియెంట్స్ ప్రైస్ మానిటరింగ్ కమిటీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కమిటీ ఫీడ్ ముడిపదార్థాల ధరలు, తయారీ ఖర్చులు, రవాణా వ్యయాలు వంటి అంశాలను శాస్త్రీయంగా అంచనా వేయనుంది. ఫిష్‌మీల్, సోయాబీన్ వంటి ప్రధాన ముడిపదార్థాల ధరలపై నిరంతర నిఘా ఉంచడం, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతలు. ఈ కమిటీలో MPEDA, CIBA, ఫిషరీస్ యూనివర్సిటీ ప్రతినిధులు, అలాగే ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులు, డీలర్ల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. కాకినాడ SIFT ప్రిన్సిపాల్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. డిజిటల్ వ్యవస్థలు పారదర్శకతకు దారితీసే చర్యలు ఫీడ్ ధరల సమీక్షను మరింత పారదర్శకంగా చేయడానికి డిజిటల్ యాప్‌ను వినియోగించనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే IoT సాంకేతికత వినియోగం, ఫీడ్ నాణ్యత ప్రమాణాల