ఏపీ విద్యారంగం అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కృషిని అభినందించిన ధర్మేంద్ర ప్రధాన్
Actor ProfilePolitician

ఏపీ విద్యారంగం అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కృషిని అభినందించిన ధర్మేంద్ర ప్రధాన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీ విద్యారంగం అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కృషిని అభినందించిన ధర్మేంద్ర ప్రధాన్
Telugu Times22 Aug 2026
ఏపీ విద్యారంగం అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ కృషిని అభినందించిన ధర్మేంద్ర ప్రధాన్

విజయనగరం జిల్లాలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ విద్యాశాఖ మంత్రి లోకేష్ పర్యటన కేంద్ర మంత్రితో కలిసి భోగాపురంలో పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ ను సందర్శించిన మంత్రి లోకేష్ పాఠశాలలో ఆధునిక విద్యా బోధన, మౌలిక వసతుల పరిశీలన భోగాపురం: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎంశ్రీ ఏపీ మోడల్ స్కూల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆధునిక విద్యా బోధన, మౌలిక వసతులను మంత్రులు పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముందుగా పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి.పార్వతి, విద్యార్థులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాలలో ఆధునిక విద్యా బోధన, మౌలిక వసతుల పరిశీలన పాఠశాల మొత్తం కలియతిరిగిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వసతులను పరిశీలించారు. ముందుగా జాదు పిఠారా కిట్ ను కేంద్ర మంత్రి పరిశీలించారు. జాదు పిఠారా కిట్ గురించి సిబ్బంది, మంత్రి లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ అందిస్తున్న స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్, అసెస్ మెంట్ బుక్ లెట్ ను కేంద్ర మంత్రికి లోకేష్ చూపించారు. విలువల విద్య కోసం ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలతో రూపొందించిన పుస్తకాల గురించి మంత్రి లోకేష్ విశదీకరించారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ ను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పరిశీలించారు. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, యూనిఫాం, స్కూల్ బ్యాగ్, షూ, బెల్ట్