
AP Govt Doctors Dismissed: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య సేవలకు ఆటంకం కలిగిస్తూ, సుదీర్ఘకాలంగా విధులకు గైర్హాజరవుతున్న వైద్యులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఏళ్ల తరబడి విధులకు రావడం లేదనే కారణంతో 43 మంది డాక్టర్లను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్య వ్యవస్థలో నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని ఈ కఠిన చర్యల ద్వారా స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరాలను వెల్లడించారు. Read also: El Nino Impact AP Farming: ఎల్‌నినో పరిస్థితులపై సమీక్ష.. వ్యవసాయ శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశాలు గత నాలుగేళ్లుగా ఈ 43 మంది వైద్యులు విధులకు హాజరుకావడం లేదని వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా వారికి పలుమార్లు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, శాఖాపరమైన అభియోగాలు కూడా నమోదు చేసింది. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, నిబంధనల ప్రకారం వారిని సర్వీసుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఏపీ సివిల్ సర్వీసెస్ (కాండక్ట్) రూల్స్-1964 ప్రకారం.. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏడాదికి మించి అనధికారికంగా విధులకు గైర్హాజరైతే వారిని ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ రూల్స్ ఆధారంగానే ప్రస్తుత చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమని, విధులను విస్మరిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని మంత్రి హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖలో జవాబుదారీతనం పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న రెండో పెద్ద నిర్ణయం ఇది. గత నెలలోనే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని వివిధ ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తూ విధులకు ఎగ్గొట్టిన 51 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్