ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. డీమ్డ్ యూనివర్శిటీల్లో చదివినా ఫీజు రీయింబర్స్ మెంట్
Actor ProfilePolitician

ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. డీమ్డ్ యూనివర్శిటీల్లో చదివినా ఫీజు రీయింబర్స్ మెంట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. డీమ్డ్ యూనివర్శిటీల్లో చదివినా ఫీజు రీయింబర్స్ మెంట్
Samayam Telugu26 Aug 2026
ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. డీమ్డ్ యూనివర్శిటీల్లో చదివినా ఫీజు రీయింబర్స్ మెంట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు తీపికబురు చెప్పింది.. డీమ్డ్ యూనివర్శిటీల్లో చదివే విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని డీమ్డ్ యూనివర్శిటీల్లో యూజీ కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ (పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్) వర్తింపజేస్తోంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేంద్ర ప్రాయోజిత పథకంతో అనుసంధానం చేసి.. ఎస్సీలకు 60 శాతం, ఎస్టీలకు 75 శాతం నిధులు అందనున్నాయి. కేంద్రం విడుదల చేసే నిధులు పోగా.. మిగతా రాష్ట్ర వాటా నిధులకు పీ-4 విధానంలో అందజేస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల విద్యోన్నతికి చేయూతనిస్తూ కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో డీమ్డ్ యూనివర్శిటీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఊరట దక్కింది.డీమ్డ్ యూనివర్శిటీలకు అవకాశంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్శిటీలు డీమ్డ్‌ వర్సిటీలుగా మారేందుకు అవకాశం ఇచ్చింది. డీమ్డ్ యూనివర్శిటీ మార్పునకు సంబంధించి ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని సెక్షన్-43ఏను కూడా ప్రభుత్వం చేర్చింది. కేబినెట్ సమావేశంలో ఏపీ ప్రైవేటు వర్సిటీల చట్టం-2016 సవరణకు ఆమోదం కూడా తెలిపింది. ప్రైవేట్ యూనివర్శిటీని మూసివేయకుండా కార్యకలాపాలను కొనసాగిస్తూనే డీమ్డ్‌ వర్సిటీ హోదాలోకి మారేలా కొత్త నిబంధనల్ని చేర్చారు.. అవసరమైన చట్ట సవరణ చేశారు. కేంద్రం నుంచి డీమ్డ్‌ హోదా రాగానే ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసి ఆ వర్సిటీని డీ-నోటిఫై చేస్తుంది. అయితే నోటిఫికేషన్‌ తర్వాతే డీమ్డ్‌ వర్సిటీగా ప్రవేశాలు చేపట్టాలి. డీ-నోటిఫికేషన్‌ చేసినా అప్పటికే వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు వారి కోర్సును పూర్తి చేయడానికి ఇబ్బంది ఉండదు. చదువు పూర్తయ్యాక ఆ డీమ్డ్‌ వర్సిటీ ద్వారానే డిగ్రీ, డిప్లొమా సర్టిఫికెట్లు జారీ చేస్తారు.ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు డీమ్డ్ హోదారాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా డీమ్డ్‌ హోదా కోసం ప్రయత్నించాయి. అనుమతుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేశాయి. డీమ్డ్ హోదా వస్తే సీట్లు నీట్‌తో భర్తీ చేస్తారు.. ఫీజులు ఉంటాయి