ఏపీలో పేదవారికి శుభవార్త.. రూ.లక్ష నుంచి రూ.50వేల వరకు ఇస్తారు
Actor ProfilePolitician

ఏపీలో పేదవారికి శుభవార్త.. రూ.లక్ష నుంచి రూ.50వేల వరకు ఇస్తారు

Total News1
Movie Updates0
Sources1
ఏపీలో పేదవారికి శుభవార్త.. రూ.లక్ష నుంచి రూ.50వేల వరకు ఇస్తారు, ఉచితంగానే.. మంత్రి కీలక ప్రకటన
Samayam Telugu15 Jun 2026
ఏపీలో పేదవారికి శుభవార్త.. రూ.లక్ష నుంచి రూ.50వేల వరకు ఇస్తారు, ఉచితంగానే.. మంత్రి కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. 2029నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారథి . రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5.50 ఇళ్లు పూర్తి చేశామన్నారు.. వీటిని అబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. మరో రెండు నెలల్లో (ఆగస్టు నాటికి) మరో 2.70 ఇళ్లు, సెప్టెంబర్ నాటికి 1.62 ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పీఎంఏవై 2.0 కింద ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఏపీలో పీఎంఏవై 2.0 కింద ఇళ్ల కోసం 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో ఇంటి నిర్మాణాల కోసం పేదలు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి ప్రభుత్వం వారికి సాయం చేస్తోందన్నారు గృహనిర్మాణశాఖ మంత్రి పార్థసారథి. అందుకే పీవీటీజీలకు రూ.లక్ష, ఎస్టీలకు రూ.75 వేలు, ఎస్సీలకు రూ.50 వేలు, బీసీలకు రూ.50 వేలు, మైనార్టీలకు రూ.50వేల చొప్పున అదనంగా ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై రూ.3,219.75కోట్ల భారం పడింది. 2026-27కు సంబంధించి మొత్తం 4.54 లక్షల ఇళ్లు, 2027-28లో 3.90 లక్షల ఇళ్లు, 2028-29లో 2.68 లక్షల ఇళ్లను నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం మొత్తం రూ.14,300 కోట్లు ఖర్చు చేయబోతున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా మారిన ఇళ్ల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ గాడిలో పెడుతుందని.. పేదలకు నాణ్యతతో ఇళ్లు కట్టించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానమంత్రి ఆవాస యోజన(PMAY 1.O) పథకం ద్వారా రాష్ట్రంలో మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెట్టించిందన్నారు మంత్రి. 2025 నవంబర్ 12న ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల మంది పేదలకు సొంతిళ్లను అందించి వారి కళ్లల్లో ఆనందాన్ని నింపామన్నారు. రెండో విడతలో 2.50లక్షల