ఏపీలో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది
Actor ProfilePolitician

ఏపీలో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది

Total News2
Movie Updates0
Sources1
ఎలాన్ మస్క్ పై ప్రశంసలు కురిపించిన ఆనంద్ మహీంద్ర
Andhra Jyothy16 Jun 2026
ఎలాన్ మస్క్ పై ప్రశంసలు కురిపించిన ఆనంద్ మహీంద్ర

ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మస్క్ రికార్డుకు ఎక్కిన నేపథ్యంలో ప్రపంచ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, భారత వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర.. మస్క్‌కు శుభాకాంక్షలు

ఏపీలో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది
Andhra Jyothy16 Jun 2026
ఏపీలో నేరాల సంఖ్య 14.1 శాతం తగ్గింది

ఏపీకి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలపై ఆధారపడి ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల రాకే తమ పనితీరుకు అద్దం పడుతోందని తెలిపారు. అమరావతి, జూన్ 16: రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలపై ఆధారపడి ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమల రాకే తమ పనితీరుకు అద్దం పడుతోందని తెలిపారు. ఏపీలో క్రైం రేటు 14.1 శాతం మేర తగ్గిందని, మొత్తంగా చూసుకుంటే 34,041 కేసులు తగ్గాయన్నారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌ టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్న పోలీసింగ్.. క్రైం రేటు తగ్గడానికి కారణమని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక సీసీటీవీ కెమెరాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజల భాగస్వామ్యాన్ని కూడా తీసుకున్నామన్నారు. నేరం జరిగాక 24 గంటల్లో నిందితుడిని పట్టుకోడానికి సీసీటీవీలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యమన్నారు. లక్ష సీసీ కెమెరాలు పెట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్నామని.. ఇప్పటికే 70 శాతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో దిశ పేరుతో అమలు చేయలేని చట్టాన్ని తెచ్చారని హోం మంత్రి విమర్శించారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. మహిళల రక్షణ కోసం ఐజీ స్థాయి అధికారిని నియమించి శక్తి యాప్‌ను ఏర్పాటు చేశామన్నారు. శక్తి యాప్‌ను కోటి 50 లక్షల మంది డౌన్లోడ్ చేయడంతో పాటు వాట్సాప్ నెంబర్‌ను కూడా అందించామన్నారు. ఇప్పటి వరకూ తప్పిపోయిన 8,356 మందిని గుర్తించి వారి ఇళ్లకు పంపించామని అనిత తెలిపారు. చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీరియస్ యాక్షన్ తీసుకున్నామన్నారు. కొందరు ప్రభుత్వం తీసుకునే చర్యలకు భయపడి వారికి వారే శిక్షించుకున్న సంఘటనలను చూశామన్నారు. నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడాలంటే ఫోరెన్సిక్ నుంచి డిపార్టమెంట్ మొత్తం బాగా పనిచేయాలని సూచించారు. మహిళలపై నేరాల్లో 6.9 శాతం తగ్గుదల కనిపించిందని అనిత తెలిపారు. లైంగిక